Begin typing your search above and press return to search.

డర్టీ పిక్చర్ 2.. బోల్డ్ ఇమేజ్ కు అసలైన సవాల్

బాలీవుడ్ లో 'ది డర్టీ పిక్చర్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గ్లామర్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఎమోషన్ తో విద్యాబాలన్ చేసిన ఆ పాత్ర నేషనల్ అవార్డును కొల్లగొట్టి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

By:  M Prashanth   |   14 Oct 2026 9:26 AM IST
డర్టీ పిక్చర్ 2.. బోల్డ్ ఇమేజ్ కు అసలైన సవాల్
X

బాలీవుడ్ లో 'ది డర్టీ పిక్చర్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గ్లామర్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఎమోషన్ తో విద్యాబాలన్ చేసిన ఆ పాత్ర నేషనల్ అవార్డును కొల్లగొట్టి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత ఆ క్రేజీ ఫ్రాంచైజీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారనే వార్త రాగానే ఇండస్ట్రీలో అందరి కళ్లూ దీనిపైనే పడ్డాయి. అందులోనూ లీడ్ రోల్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా పేరు పరిశీలనలో ఉందనే టాక్ బయటకు రావడంతో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి తమన్నా కెరీర్ ను గమనిస్తే గత కొన్నేళ్లుగా ఆమె తన కంఫర్ట్ జోన్ ను పూర్తిగా బ్రేక్ చేసుకుంటూ వస్తోంది. ఒకప్పటి కమర్షియల్ పక్కింటి అమ్మాయి ఇమేజ్ ను పక్కనపెట్టి లస్ట్ స్టోరీస్ 2 లాంటి ప్రాజెక్టులతో ఎంత బోల్డ్ కంటెంట్ నైనా చేయగలనని నిరూపించుకుంది. జైలర్, స్త్రీ 2 స్పెషల్ సాంగ్స్ తో దేశవ్యాప్తంగా సెన్సేషనల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇలాంటి ఫేజ్ లో ఉన్న తమన్నా డర్టీ పిక్చర్ లాంటి పవర్ ఫుల్ బ్రాండ్ లో భాగమవుతుందనే ప్రచారంలో ఆశ్చర్యమేమీ లేదు.

అయితే ఈ రేసులో తమన్నా మాత్రమే కాదు, యానిమల్' చిత్రంతో ఒక్క రాత్రిలోనే స్టార్ డమ్ చూసిన తృప్తి దిమ్రి పేరు కూడా మేకర్స్ పరిశీలనలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్రష్ గా దూసుకుపోతున్న తృప్తికి నేషనల్ లెవెల్ లో మంచి బజ్ ఉంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేసినా.. గతంలో విద్యాబాలన్ సెట్ చేసిన ఆ హై బెంచ్ మార్క్ ను మ్యాచ్ చేయడమనేది అంత ఈజీ టాస్క్ కాదు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, పార్ట్ 2 కోసం సిల్క్ స్మిత కథ కంటే మరింత బోల్డ్ నటీమణుల జీవితాలను హైలెట్ చేయనున్నారట. టైటిల్ బ్రాండ్ ను మాత్రమే వాడుకుని ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్ తో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొదటి భాగంలో బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ, ఒక నటి జీవితంలోని విషాదం, ఆత్మగౌరవ పోరాటమే కథకు ప్రాణంగా నిలిచాయి. ఇప్పుడు రాబోయే కొత్త కథలోనూ అలాంటి బలమైన భావోద్వేగాలు ఉంటాయా లేక కేవలం హైప్ కోసమే ఆ టైటిల్ వాడుకుంటున్నారా అన్నది చూడాలి.

తమన్నా విషయానికి వస్తే ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటి అడుగు. ఓటీటీ స్క్రీన్ల మీద బోల్డ్ సీన్లలో కనిపించడం వేరు, థియేటర్లలో సింగిల్ లీడ్ గా ఒక భారీ సినిమా భారాన్ని మోయడం పూర్తిగా వేరు. విద్యాబాలన్ ఆ పాత్రను ఎంతో డిగ్నిటీతో చేసి ఆడియన్స్ ను మెప్పించింది. తమన్నా ఆ రేంజ్ లో నటనతో పాటు గ్లామర్ ను బ్యాలెన్స్ చేయగలిగితే బాలీవుడ్ లో ఆమె స్థాయి మరింత పెరుగుతుంది. కొంచెం తేడా కొట్టినా ఆ నెగెటివిటీని భరించాల్సి ఉంటుంది.

డర్టీ పిక్చర్ 2 లో తమన్నా నటిస్తుందనే గాసిప్ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మరింత వైరల్ అవుతోంది. కాస్టింగ్ పరంగా మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఒకవేళ తమన్నా ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబితే మాత్రం అది ఆమె కెరీర్ లోనే అత్యంత సాహసోపేతమైన ప్రయోగం అవుతుంది. మరి ఈ క్రేజీ సీక్వెల్ ను మిల్కీ బ్యూటీ చేజిక్కించుకుంటుందో లేక యంగ్ బ్యూటీ తృప్తి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.