Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా పెళ్లి.. అత‌డు ఎవ‌రో తెలుసా?

అయితే త‌మ‌న్నాను ఇప్ప‌టికీ మీడియాలు వ‌దిలి పెట్ట‌డం లేదు. మిట్కీ వైట్ బ్యూటీకి ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారంటూ నెటిజ‌నుల్లో నిరంత‌రం ప్ర‌చారం సాగుతూనే ఉంది.

By:  Sivaji Kontham   |   3 Aug 2025 5:51 PM IST
త‌మ‌న్నా పెళ్లి.. అత‌డు ఎవ‌రో తెలుసా?
X

ఒక రోజు క్రికెట‌ర్ తో .. మ‌రో రోజు స‌హ‌న‌టుడితో.. ఇంకోరోజు డాక్ట‌ర్‌- బిజినెస్‌మేన్‌తో... ఇకపైనా ఎవ‌రితో ముడిపెడ‌తారో తెలీదు! మొత్తానికి త‌మ‌న్నా ఎవ‌రో ఒక‌రిని పెళ్లాడేయ‌బోతోంద‌నే పుకార్లు ఇప్ప‌టికీ ఆగ‌డం లేదు. త‌మ‌న్నా భాటియా- విజ‌య్ వ‌ర్మ ప్రేమాయ‌ణం, జంట షికార్ల గురించి చాలా కాలం పాటు ప్ర‌చారం సాగింది. కానీ ఈ జంట బ్రేక‌ప్ అవ్వ‌డం అభిమానుల‌కు షాకిచ్చింది. ఇది ఊహించ‌నిది. కానీ కాలంతో పాటే గ‌తించిపోయే శాశ్వ‌త‌ నిజం.

నిప్పు లేదు పొగ లేదు అయినా..

అయితే త‌మ‌న్నాను ఇప్ప‌టికీ మీడియాలు వ‌దిలి పెట్ట‌డం లేదు. మిట్కీ వైట్ బ్యూటీకి ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారంటూ నెటిజ‌నుల్లో నిరంత‌రం ప్ర‌చారం సాగుతూనే ఉంది. క‌థానాయిక‌ల విష‌యంలో ఇలాంటి ప్ర‌చారం స‌హ‌జ‌మే అనుకున్నా, నిప్పు లేదా పొగ ఈ రెండిటిలో ఏ ఒక్క‌టీ లేక‌పోయినా ఇలాంటివి ఎలా పుట్టిస్తున్నారో ఎవ‌రికీ అర్థం కాని గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తోంది.

పాకిస్తానీ క్రికెట‌ర్ ని క‌లిసాను:

ఒకానొక సంద‌ర్భంలో త‌మ‌న్నా మాట్లాడుతూ.. త‌న‌పై సాగుతున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని త‌ట్టుకోలేక‌పోయాన‌ని అన్నారు. ఒక‌సారి పాకిస్తాన్ క్రికెట‌ర్ అబ్ధుల్ ర‌జాక్ తో ముడిపెట్టార‌ని కూడా ఆవేద‌న చెందారు. అబ్దుల్ రజాక్ నేను ఓ ఆభ‌ర‌ణాల దుకాణం ఓపెనింగులో క‌లిసాం. ఆ షాప్ పేరేమిటో తెలీదు కానీ, అత‌డిని నేను క‌లిసాను అని నెటిజ‌నులు రాసారు. ర‌జాక్ ని పెళ్లాడుతున్నాన‌ని కూడా ప్ర‌చారం చేసారు.

నా భ‌ర్త నేను షాపింగ్‌లో..

ఓ పాడ్ కాస్ట్ లో ఈ విచిత్ర‌మైన ప్ర‌చారం గురించి ప్ర‌స్థావిస్తూ త‌మ‌న్నా కొంత ఇబ్బందిక‌రంగా ఫీలైంది. స‌హ‌ న‌టుడు, డాక్ట‌ర్ లేదా క్రికెట‌ర్ తో న‌న్ను ఎవ‌రో ఒక‌రితో ముడి వేస్తారు. నేను నా భ‌ర్త షాపింగ్ లో ఉన్నామ‌నే భావ‌న తెచ్చేస్తారు. ప్రేమలో ఉండటం అనే ఆలోచన నాకు చాలా ఇష్టమే అయినా కానీ, నా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే నేను నిరాధారమైన వార్తలను అంగీకరించను. నేను ప్రస్తుతం ఒంటరిగా సంతోషంగా ఉన్నాను. నా తల్లిదండ్రులు వరుడి కోసం వెతుకులాటలో లేరు..! అని కూడా త‌మ‌న్నా త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఖండించారు.

ప్ర‌స్తుతం ఒంట‌రిని...

నేను ప్ర‌స్తుతం ఒంట‌రిగా ఉన్నాను.. ఒక‌వేళ‌ ప్రేమ‌లో ప‌డ్డాను అంటే అది కేవ‌లం సినిమాల‌తో మాత్ర‌మే. నిరంత‌రం సినిమాల్లో న‌టించేందుకు వెతుకుతూనే ఉంటాను. అస‌లు ఈ ఊహాగానాలు ఎక్క‌డి నుంచి పుట్టుకొస్తాయో కానీ ఒక్క‌టీ నిజం కాదు. నేను నా మార్గంలో వెళుతున్నాను. ఒక‌వేళ గౌర‌వ‌నీయ‌మైన వివాహ‌వ్య‌వ‌స్థ‌లోకి అడుగుపెడితే క‌చ్ఛితంగా అంద‌రికీ చెబుతాను. నాపై త‌ప్పుడు క‌థ‌నాలు రాయ‌డం అగౌర‌వం అని కూడా త‌మ‌న్నా నాటి పాడ్ కాస్ట్ లో వ్యాఖ్యానించారు.

వ‌రుస చిత్రాల‌తో బిజీ..

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌మ‌న్నా ఇటీవ‌ల ఓదెలా 2 చిత్రంతో అభిమానుల‌ను అల‌రించింది. యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న `రైడ్ 2`లోను న‌టించింది. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో మిల్కీ బిజీ బిజీగా ఉంది. బాలీవుడ్ లో రోహిత్ శెట్టి తెర‌కెక్కిస్తున్న భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టిస్తున్న త‌మ‌న్నా, `వి-వాన్- ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` అనే చిత్రంలోను న‌టిస్తోంది. అడ‌వి నేప‌థ్యంలో రూపొందుతున్న `రేంజ‌ర్`లో అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న త‌మ‌న్నా ఆడిపాడ‌నుంది. ఈ సినిమాని ఇటీవ‌లే ప్ర‌క‌టించారు.