తమన్నా బోల్డ్ ప్లానింగ్ దిమ్మతిరిగేలా!
సాధారణంగా కథానాయికలు కెరీర్ తొలి నాళ్లలోనే పరిమితులు విధించుకుని ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమవుతుంటారు.
By: Srikanth Kontham | 18 Oct 2026 11:00 PM ISTపద్దెనిమిదేళ్లకు పైగా పరిశ్రమను ఏలుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఊహించని రీతిలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ డ్యాన్స్‌లతో మెరిసిన భామ ఇప్పుడు రూట్ మార్చి వరుసగా బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ పాత్రలను ఎంచుకుంటూ ట్రేడ్ వర్గాలను సైతం
ఆశ్చర్యపరుస్తోంది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి ఇలాంటి బోల్డ్ నిర్ణయాలు తీసుకోవడం వెనుక సుదీ ర్ఘమైన వ్యూహం దాగి ఉందనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
తన ప్రయాణంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా? మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ వచ్చిన తర్వాత గ్లామర్ అండ్ కంటెంట్ పరంగా సరికొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. గతంలో `లస్ట్ స్టోరీస్ 2`, `జీ కర్దా` వంటి ప్రాజెక్ట్‌లతో బోల్డ్ కాన్సెప్ట్‌లలో నటనతో దుమ్మురేపిన తమన్నా ఇప్పుడు అంతకుమించిన క్రేజీ ప్రాజెక్ట్‌లపై కన్నేశారు. బాలీవుడ్లో సంచలనం సృష్టించిన `రాగిణి MMS 3`.. విద్యాబాలన్ ఐకానిక్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న `ది డర్టీ పిక్చర్ 2` వంటి ప్రతిష్టాత్మక బోల్డ్ అండ్ హారర్ ప్రాజెక్ట్‌లలో ఆఫర్లు అందుకోవడం తమన్నా ప్లానింగ్‌కు అద్దం పడుతోంది.
సాధారణంగా కథానాయికలు కెరీర్ తొలి నాళ్లలోనే పరిమితులు విధించుకుని ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమవుతుంటారు. కానీ తమన్నా మాత్రం ఇండస్ట్రీలో 18 ఏళ్ల అనుభవాన్ని ప్లస్ పాయింట్‌గా మార్చుకుని తనకంటూ ఎలాంటి ఇమేజ్ చట్రాలు లేకుండా ముందడుగు వేస్తున్నారు. తెరపై గ్లామర్‌ను ప్రదర్శించడమే కాకుండా నటిగా తనలోని పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసేందుకు బోల్డ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ సరిగ్గా సరిపోతుందని బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.
హారర్, థ్రిల్లర్, బోల్డ్ ఎలిమెంట్స్ కలగలిసిన కథలకు ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే `రాగిణి MMS 3` వంటి పాపులర్ ఫ్రాంచైజీలలో తమన్నా ఎంట్రీ ఇవ్వడం మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు దోహదపడుతుంది. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వడానికి ఇలాంటి భిన్నమైన కాన్సెప్ట్‌లు ఎంతో అవసరమని తమన్నా పక్కా స్కెచ్‌తో అడుగులు వేస్తున్నారు.
అలాగే నటనలో సీనియారిటీ పెరిగే కొద్దీ కొత్త సవాళ్లను స్వీకరించడమే నిజమైన నటి లక్షణమని తమన్నా భావిస్తున్నారు. అందుకే కథలో బలముండి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఎంతటి బోల్డ్ లుక్‌లోనైనా.. విభిన్నమైన రోల్లోనైనా నటించేందుకు వెనుకాడటం లేదు. తమన్నా తీసుకుంటున్న డేరింగ్ నిర్ణయాలు నేటితరం కథానా యికలకు కూడా బెంచ్ మార్క్‌గా మారుతున్నాయనడంలో సందేహం లేదు.
మొత్తానికి మిల్కీ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ విషయంలో అనుసరిస్తున్న బోల్డ్ ప్లానింగ్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. గ్లామర్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేస్తూనే.. సరికొత్త తరహా చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు తమన్నా సిద్ధమైన తీరు ఆమెలోని ప్రొఫెషనిజానికి.. విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
