స్టైలిష్ లుక్ లో తమన్నా.. ఇలా ఎప్పుడైనా చూశారా?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా భాటియా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
By: M Prashanth | 24 April 2026 12:15 PM ISTబాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా భాటియా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానులతో టచ్ లో ఉండేందుకు ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు, అభిప్రాయాలు పంచుకుంటూ వస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవల జరిగిన GQ అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయులు 2026 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా, ఆ ఎక్స్పీరియన్స్ ను అభిమానులతో పంచుకున్నారు. ఆ సందర్భంగా ఆమె రాసుకొచ్చిన ఎమోషనల్ కామెంట్స్ అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. ఆ ఈవెంట్ లో ఉన్న ఎన్విరాన్మెంట్, సహచరుల మధ్య ఉన్న అనుబంధం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొంది.
'ఆ రాత్రి ఇప్పటికీ నా మనసులో ఉంది. అందరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తూ, నిజమైన ఆనందాన్ని పంచుకున్నారు. విభిన్న రంగాల్లో ఉన్న వ్యక్తుల ప్రయాణాలను చూసి గర్వంగా అనిపించింది' అని ఆమె తన పోస్ట్ లో తెలిపారు. సహచరులు ఒకరిని ఒకరు అభినందించుకోవడం, ఎంకరేజ్ చేసుకోవడం వంటి అంశాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని వెల్లడించారు తమన్నా.
అలాగే ఆ రోజు తాను ఎలా రెడీ అయ్యారో అమ్మడు వివరించారు. సాధారణంగా తొందరపడే తనకు, ఈసారి మాత్రం ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా రెడీ అయ్యానని చెప్పింది. డ్రెస్సింగ్ నుంచి స్టైలింగ్ వరకు ప్రతి చిన్న విషయానికీ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఆ ప్రాసెస్ ను ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపింది. ఆ ఈవెంట్ లో తమన్నా ధరించిన డ్రెస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బ్లూ కలర్ లో క్రేజీ చెక్స్ డిజైన్ తో ఉన్న ఆ అవుట్ ఫిట్ లో ఆమె చాలా స్టైలిష్ గా కనిపించింది. కేప్ తో కూడిన ఆ లుక్ లో పవర్, ప్లేఫుల్ నెస్ రెండూ కలిసినట్లు అనిపించిందని ఆమె పేర్కొంది. తన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేసేలా ఆ లుక్ ఉండటం మరింత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు తమన్నా. 'ఆ రోజు పూర్తిగా ఆనందంతో నిండిపోయింది. అలాంటి రోజులు తొందరగా ముగించకుండా ఆస్వాదించాలి. నిజమైన సెలబ్రేషన్ అంటే మనుషులతో కలిసి పంచుకునే ఆనందం' అంటూ తన భావాలను వ్యక్తం చేసింది.
ఆ అనుభవం తనకు ఎంతో ప్రత్యేకమని, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పింది. తమన్నా పోస్ట్ కు ఫ్యాన్స్ నుంచి సూపర్ వస్తోంది. ఆమె స్టైల్, ఆలోచనలు, క్యాప్షన్ ను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె అవుట్ ఫిట్, ఫోటో షూట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో పంచుకుంటూ తమన్నా మరోసారి అందరి మనసులు గెలుచుకున్నారని చెప్పాలి.
