హీరోయిన్‌ని మార్చమని ఫేస్ మీదే చెప్పేసాడు!- తమన్నా
సినీపరిశ్రమలో అవకాశాల్ని నిలబెట్టుకోవడం అంత సులువు కాదు. హీరోయిన్లు, నటీమణులను బహిరంగంగా కమిట్‌మెంట్లు అడుగుతారు.
By: Sivaji Kontham | 7 Aug 2025 12:20 AM ISTసినీపరిశ్రమలో అవకాశాల్ని నిలబెట్టుకోవడం అంత సులువు కాదు. హీరోయిన్లు, నటీమణులను బహిరంగంగా కమిట్‌మెంట్లు అడుగుతారు. ఒకప్పటితో పోలిస్తే ఇటీవల మీటూ ఉద్యమం, ఉమెన్ ఇన్ కలెక్టివ్ టీమ్స్ ఏర్పాటు కారణంగా నేరుగా ఎవరూ కమిట్ మెంట్లు అడగటం లేదు కానీ, ఒకప్పుడు వేధింపుల మాన్ స్టార్లు మహిళల్ని ఏ కోణంలో చూసేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది గ్లామర్ రంగం విలువను తగ్గించింది.
మీటూ సమయంలో ధైర్యం:
మీటూ ఉద్యమ సమయంలో చాలా మంది కథానాయికలు తమకు జరిగిన అన్యాయాలను బయటకు చెప్పుకుని ఆవేదన చెందారు. పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఒక రకంగా మీటూ ఉద్యమం తర్వాత తమకు జరిగిన ప్రతి అన్యాయాన్ని కథానాయికలు బహిరంగంగా వ్యాఖ్యానించగలుగుతున్నారు. ఇది నిజంగా కొత్త పరిణామాం. ప్రస్తుతం సినీపరిశ్రమల్లో యువతులను కాపాడేందుకు ప్రత్యేకించి క్రమశిక్షణా కమిటీలు పని చేస్తున్నాయి.
ఇప్పటికి ఓపెనైన తమన్నా:
అయితే చాలా కాలం క్రితం ఒక సౌత్ హీరో కారణంగా తాను ఎదుర్కొన్న ఒక అసౌకర్యం గురించి ఇప్పుడు మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఓపెన్ గా చెప్పుకొచ్చింది. సౌత్ లో ఒక ప్రముఖ హీరోతో ఒక సన్నివేశంలో నటించాల్సి ఉంది. సీన్ లో ఉన్నప్పుడు తనకు అసౌకర్యంగా అనిపించింది. ఆ విషయాన్ని నేరుగా ఆయనతోనే సెట్స్ లో చెప్పేయడంతో సదరు హీరో చిన్నబుచ్చుకున్నాడు. సూటిగా ముఖంపైనే ``హీరోయిన్ ని మార్చండి!`` అని సీరియస్ అయ్యాడట. ఆ తర్వాత తమన్నా స్థానంలో వేరొకరిని తీసుకున్నారు. అది ఏమైనా ఇంటిమేట్ సన్నివేశమా? అని అడిగితే అలాంటిదేమీ కాదని తమన్నా చెప్పుకొచ్చింది.
ఓపిక సహనం అవసరం:
ఆ సీన్ లో అతడు ఫైర్ అయినంత మాత్రాన తాను భయపడి కంగారు పడలేదని, అలాగే దానిని ఓపిగ్గా, శాంతంగా మ్యానేజ్ చేసానని తమన్నా చెప్పుకొచ్చింది. ఎవరైనా మనపై కోప్పడినప్పుడు అనవసరంగా మనం ఎదురు తిరగ కూడదు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జాగ్రత్తగా మన ఇబ్బందిని ఎదుటివారికి వివరంగా చెప్పాలి అంతే! అని సూచించారు. నిజానికి తమన్నా చెప్పిన విషయం నేటితరం ఔత్సాహిక నటీమణులకు ఎంతగానో ఉపకరిస్తుంది. కోపం, భయం వంటి ఎమోషన్లతో పని లేకుండా తమకు ఎదురయ్యే క్లిష్ఠ సన్నివేశాన్ని మహిళలు ఎదుటివారికి చెప్పే పద్ధతి కూడా చాలా ముఖ్యం.
ఆ సౌత్ హీరో తెలుగు హీరోయేనా?
ఆ సన్నివేశంలో అలా జరిగినా కానీ తన కెరీర్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదని కూడా తమన్నా చెప్పుకొచ్చింది. తనను ఎవరైతే అన్నారో వారంతా ఆ తర్వాత తనను ఎంతగానో గౌరవించారని కూడా తమన్నా చెప్పుకొచ్చారు. నెమ్మదిగా ముందుకు వెళ్లి కెరీర్ పరంగా ఎదిగితే ప్రతిదీ జయించవచ్చని తమన్నా ఈ ఇంటర్వ్యూలో తన అనుభవాలను వివరించారు.
కెరీర్ జర్నీ అలా..
శ్రీ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తమన్నా హ్యాపీడేస్ , 100 పర్సంట్ లవ్ చిత్రాలతో బిగ్ బ్రేక్ అందుకుంది. చాలా పెద్ద సినిమాల్లో నటించినా అవన్నీ ఫ్లాపులుగానే మిగిలాయి. బాహుబలి తనకు పాన్ ఇండియాలో గుర్తింపును ఇచ్చింది. అయితే ఏ సౌత్ హీరో సరసన నటించినప్పుడు తాను అసౌకర్యంగా ఫీలైందో మాత్రం తమన్నా చెప్పలేదు. తమన్నా తెలుగు, తమిళం, మలయాళంలో కూడా నటించింది. ఇంతకీ ఆ హీరో ఎవరై ఉంటారబ్బా?
