బాలీవుడ్ లో బిజీగా మారిన మిల్కీ బ్యూటీ
హీరోలకు ఉన్నట్టు హీరోయిన్లకు సినీ ఇండస్ట్రీలో కెరీర్ లాంగ్ రన్ ఉండదు. హీరోయిన్ల కెరీర్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సంవత్సరాలే ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 23 Sept 2025 7:00 PM ISTహీరోలకు ఉన్నట్టు హీరోయిన్లకు సినీ ఇండస్ట్రీలో కెరీర్ లాంగ్ రన్ ఉండదు. హీరోయిన్ల కెరీర్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సంవత్సరాలే ఉంటుంది. హీరోల్లాగా వయసు మీద పడినా వారికి అవకాశాలు రావు. అందుకే వయసు, అవకాశాలు ఉన్నప్పుడే జాగ్రత్తపడి ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటారు. వయసు మీద పడేకొద్దీ హీరోయిన్ల అందంతో పాటూ అవకాశాలు కూడా తగ్గుతూ వస్తాయి.
తమన్నా ఫోకస్ అంతా దానిపైనే!
కానీ 35 ఏళ్ల వయసులో కూడా మిల్కీ బ్యూటీ తమన్నా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేనిది గ్లామర్ టచ్ ఉన్న క్యారెక్టర్లు చేయడానికి సిద్ధమై, వాటిపైనే ఇప్పుడు తన ఫోకస్ ను పెట్టారు తమన్నా. ఓ వైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు స్పెషల్ నెంబర్లు, ఐటెం సాంగ్స్ లో నటించడానికి కూడా ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా కెరీర్లో దూసుకెళ్తున్నారు.
ఐటెం సాంగ్ కు ఫస్ట్ ఆప్షన్ గా మారిన తమన్నా
తమన్నా చేసిన స్పెషల్ సాంగ్స్ అన్నీ చార్ట్‌బస్టర్లుగా మారిన నేపథ్యంలో ఏ భారీ సినిమాలో ఐటెం సాంగ్ చేయాలన్నా అందరికీ ముందు ఆప్షన్ గా తమన్నానే కనిపిస్తున్నారు. తమన్నా తోటి హీరోయిన్లు ఆఫర్లు అందుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, అమ్మడు మాత్రం బాలీవుడ్ లో సినిమాలు, సాంగ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు.
రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా..
రైడ్2లో నషా, ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లోని గఫూర్ సాంగ్స్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్లుగా నిలవడంతో తమన్నా బాగా ఫేమస్ అయ్యారు. గతంలో ఎప్పుడూ లేనంత హాట్ గా తమన్నా కనిపించడంతో ఆమె వీడియోలన్నీ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. పైగా తమన్నా మంచి డ్యాన్సర్ తో పాటూ అందగత్తె కూడా. ఫిట్‌నెస్ విషయంలో ఆమె ఎంతో కేర్ తీసుకోవడం వల్ల స్క్రీన్ పై కూడా తమన్నా చాలా హాట్ గా కనిపిస్తుంటారు. దానికి తోడు ఎక్స్‌పోజింగ్ విషయంలోనూ ఎలాంటి పరిమితులు లేవు. ఇన్ని క్వాలిటీస్ ఉండబట్టే తమన్నా రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేసినా అమ్మడు అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమన్నా కొత్తగా ఏ తెలుగు సినిమాకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు.
