Begin typing your search above and press return to search.

తమన్నా 'మిల్కీబ్యూటీ' అసలు సీక్రెట్ ఇదా.. అసహ్యించుకుంటున్న నెటిజన్స్!

ఇంతే అందంగా.. ఇంతే యవ్వనంగా కనిపించడం వెనుక అసలు కారణం ఏంటి? అని.. ఈ మిల్కీ బ్యూటీ అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   7 Aug 2025 10:56 AM IST
తమన్నా మిల్కీబ్యూటీ అసలు సీక్రెట్ ఇదా.. అసహ్యించుకుంటున్న నెటిజన్స్!
X

పాల మీగడ లాంటి మేని ఛాయతో ఎప్పటికప్పుడు యువతను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది తమన్నా భాటియా. అంతేకాదు తన అందంతో మిల్కీ బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. అదే అందంతో.. అదే క్రేజ్ తో దూసుకుపోతోంది. సినిమాలలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా.. స్పెషల్ సాంగ్ లలో నర్తిస్తూ ఇండస్ట్రీలో తన ఇమేజ్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే తమన్నా ఇన్నేళ్లయినా.. ఇంతే అందంగా.. ఇంతే యవ్వనంగా కనిపించడం వెనుక అసలు కారణం ఏంటి? అని.. ఈ మిల్కీ బ్యూటీ అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఊహించని కామెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తమన్నా చెప్పిన ఆ బ్యూటీ సీక్రెట్ విని కొంతమంది నెటిజన్స్ అసహ్యించుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్న తమన్నా తన బ్యూటీ సీక్రెట్ కూడా చెప్పేసింది. ఇంటర్వ్యూలో భాగంగా.." మీరు మొటిమలు తగ్గించుకోవడానికి ఏం చేస్తారు?" అని అడగగా.. దీనికి తమన్నా స్పందిస్తూ.." ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నా నోటిలో ఉండే సలైవా (ఉమ్మి )మొటిమలపై రాసుకుంటాను. అవి క్రమంగా తగ్గిపోతాయి. ఇది నాకు వ్యక్తిగతంగా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా దీని వెనుక సైన్స్ కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఉదయం లేవగానే వచ్చే సలైవా (ఉమ్మి) లో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మొటిమలను, మొటిమల తాలూకు మచ్చల్ని కూడా తొలగిస్తుంది" అంటూ చెప్పుకొచ్చింది.

ఈ విషయం వైరల్ అవ్వడంతో.. దీనిపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది లాలాజలాన్ని ముఖంపై రాసుకోవడం ఏంటి? అని అసహ్యించుకుంటుంటే.. మరికొంతమంది వేలకు వేలు ఖర్చుపెట్టి క్రీములు ఉపయోగించినా తగ్గని సమస్య.. ఉమ్మితో తగ్గిపోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే తమన్నా ఈ చిట్కా చెప్పడం ఇదేం మొదటిసారి కాదు.. 2021 లో కూడా ఇదే కామెంట్ చేసింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడంతో గత ఏడాది డిసెంబర్లో ఎయిమ్స్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గార్గి తనేజా ఒక వీడియో షేర్ చేస్తూ అసలు విషయం చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఉదయం లేవగానే లాలాజలం రాస్తే మొటిమలు తగ్గుతాయని , చర్మం మెరిసిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. ఇది కేవలం ఒక రూమర్ మాత్రమే. నోటిలో శుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల లాలాజలం క్షారానికి బదులుగా ఆమ్లంగా కూడా మారవచ్చు. పరిశుభ్రత లోపం కారణంగా నోటిలో ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి మొటిమలపై రాసినప్పుడు నష్టాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు అంటూ ఆమె ముందస్తు హెచ్చరిక చేశారు.

దీంతో కొంతమంది నెటిజన్స్ తమన్నా ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసింది అని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండగా.. తమన్నా చెప్పిన ఈ చిట్కా అందరికీ వర్కౌట్ కావాలన్న రూల్ ఏమీ లేదు.. ఆమె తనకు వ్యక్తిగతంగా వర్కౌట్ అయ్యిందని మాత్రమే చెప్పిందని, దీనిని భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు అని తమన్న అభిమానులు తమన్నాకు సపోర్ట్ చేస్తున్నారు.