20 ఏళ్లు.. ఇలా తమన్నాకే సాధ్యం
సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఇరువై.. ముప్పై ఏళ్లు కొనసాగడం సర్వ సాధారణం. కానీ హీరోయిన్స్ మాత్రం అయిదు పదేళ్లు మాత్రమే ఉంటున్నారు.
By: Ramesh Palla | 18 Sept 2025 1:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో హీరోలు ఇరువై.. ముప్పై ఏళ్లు కొనసాగడం సర్వ సాధారణం. కానీ హీరోయిన్స్ మాత్రం అయిదు పదేళ్లు మాత్రమే ఉంటున్నారు. పదేళ్ల తర్వాత కూడా ఉన్నారు అంటే ఉన్నారు అన్నట్లే ఉంటారు. అంటే చాలా తక్కువ సినిమాలు చేయడం, ప్రాధాన్యత లేని పాత్రల్లో కనిపించడం, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారడం వంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ అతి కొద్ది మంది మాత్రం 20 ఏళ్లు దాటినా హీరోయిన్‌గా బిజీగా ఉంటారు. బాలీవుడ్‌లో ఇలా కొందరు ఉన్నారు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఇలా రెండు దశాబ్దాల పాటు బిజీగా ఉండటం, ఆ తర్వాత కూడా బిజీగా సినిమాలు చేయడం అనేది లేదు. కానీ రెండు దశాబ్దాల సినీ జర్నీ తర్వాత కూడా మిల్కీ బ్యూటీ తమన్నా బిజీగా ఉండటం ఆమెకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఆమె ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ అంటున్నారు.
అల్లుడు శీను సినిమాలో తమన్నా ఐటెం సాంగ్
తమన్నా ప్రస్తుతం నాలుగు అయిదు సినిమాలు చేస్తుంది. అవన్నీ హిందీ సినిమాలు కావడం విశేషం. మరో వైపు సౌత్‌లో తెలుగు, తమిళ్ భాషల్లో క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లో చేయడం మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా హీరోయిన్స్ ఐటెం సాంగ్‌లు చేయడంను కొందరు తప్పుబడుతారు. కానీ మిల్కీ బ్యూటీ ఐటెం సాంగ్స్ చేయడం మొదలు పెట్టిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు వేశారు అనడంలో సందేహం లేదు. మొదటగా ఈమె తెలుగులో అల్లుడు శీను సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఆ సినిమాలో సమంత హీరోయిన్ అయినప్పటికీ తమన్నా ఐటెం సాంగ్ చేయడం ద్వారా సినిమా వెయిట్ పెరిగింది, అంతే కాకుండా హీరోయిన్ స్థాయి క్రేజ్ దక్కింది. తమన్నా ఐటెం సాంగ్ వల్ల అల్లుడు శీను సినిమా స్థాయి మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు.
హ్యాపీడేస్ తో తమన్నా టాలీవుడ్‌లో బిజీ
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో 2005లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో శ్రీ మూవీతో మంచు మనోజ్‌తో కలిసి తన నటన ప్రస్థానం మొదలు పెట్టింది. హీరోయిన్‌గా మొదటి సినిమా ఆమెకు తీవ్రంగా నిరాశను మిగిల్చింది. మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో వెంటనే ఆఫర్ రాలేదు. తమిళ్ లో ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత లక్కీగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ సినిమాను చేసే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో చాలా మందిలో ఒక అమ్మాయిగా ఉన్నప్పటికీ తన నటనతో మెప్పించింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌లో ఈ అమ్మడికి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఆ సినిమాలో నటనతో మంచి మార్కులు దక్కించుకుంది. కమర్షియల్‌గా 100% లవ్ సినిమా ఈమె స్థాయిని పెంచింది అనడంలో సందేహం లేదు.
తమన్నా ఐటెం సాంగ్స్ సూపర్ హిట్
ఇండస్ట్రీలో ఇరవై ఏళ్లుగా కొనసాగడం, ఇప్పటికీ వరుసగా సినిమాలు చేయడంకు కారణం ఖచ్చితంగా తమన్నా కష్టపడే తత్వం అనడంలో సందేహం లేదు. ఆమె హీరోలకు సమానంగా డాన్స్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది అనే అభిప్రాయంకు ప్రేక్షకులు వచ్చే విధంగా ఆమె కష్టపడింది. డాన్స్ విషయంలో టాలీవుడ్‌లో తమన్నాను బీట్ చేసే వారు లేరు అన్నట్లుగా ఆమె ఒక అభిప్రాయంను క్రియేట్ చేయడం వల్ల ఇప్పటికీ ఆమె అంటే ప్రేక్షకుల్లో అభిప్రాయం ఉంది. అంతే కాకుండా మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో వరుసగా ఐటెం సాంగ్స్ చేయడం, అవి అదృష్టం కొద్ది సూపర్ డూపర్ హిట్ కావడం, ఆ పాటల వల్ల సినిమాల స్థాయి పెరగడం వంటివి కూడా ఆమెకు ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండటానికి కారణం. తమన్నా మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో బిజీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
