డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ!
ఈయన పంచుకున్న ఫోటోలలో ఒక ఫోటోలో డెనిమ్ డ్రెస్ ధరించి చేతిలో పువ్వులు పట్టుకొని చాలా ప్రశాంతంగా సహజ లుక్కుతో అందరిని ఆకట్టుకుంది .
By: Madhu Reddy | 26 Jan 2026 1:48 PM ISTప్రముఖ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. శ్రీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత క్రమంగా రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ప్రభాస్ , ఎన్టీఆర్ లాంటి దిగ్గజ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది తమన్న. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే కథల ఎంపిక విషయంలో తడబాటుపడ్డ తమన్న.. అవకాశాలను కోల్పోయింది. వచ్చిన అవకాశాలలో సక్సెస్ అందుకోలేక ఫ్లాపులు ఎదుర్కొంది.
ఇకపోతే ఈమధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్న తమన్నా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా స్పెషల్ సాంగ్ లతో మరింత క్రేజ్ దక్కించుకుంది. అంతేకాదు ఐదు నిమిషాలకు ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది తమన్నా. అందులో డిఫరెంట్ లుక్కులో డిఫరెంట్ మూడ్ ప్రదర్శిస్తూ.. షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈయన పంచుకున్న ఫోటోలలో ఒక ఫోటోలో డెనిమ్ డ్రెస్ ధరించి చేతిలో పువ్వులు పట్టుకొని చాలా ప్రశాంతంగా సహజ లుక్కుతో అందరిని ఆకట్టుకుంది .బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉన్న స్కర్ట్ ధరించి హుందాగా కనిపించింది. ఇంకొక ఫోటోలో క్రీం కలర్ డ్రెస్ ధరించి అందమైన జువెలరీతో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే మూడు భిన్నమైన ఫోటోలను పంచుకున్న తమన్నా అందులో తన అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.
తమన్నా సంతోష్ భాటియాగా 1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించింది. ఈమెకు ఆనంద్ భాటియా అనే అన్నయ్య కూడా ఉన్నారు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఏకంగా దక్షిణ భారత సినిమాలలో 89 చిత్రాలలో నటించి ప్రముఖ నటిగా పేరు గడించింది. తన నటనతో మూడు సంతోషం ఫిలిం అవార్డులు, రెండు సైమా అవార్డులతో పాటు అనేక అవార్డులను అందుకుంది. కళైమామణి అవార్డు కూడా ఈమెకు వరించింది.
తమన్నా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళ్ లో పురుషన్ అనే యాక్షన్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. దీనిని తెలుగులో మొగుడు అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు .ఇకపోతే తమన్నా హీరోయిన్గా , విశాల్ హీరోగా వస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో యోగి బాబు తో పాటు పలువురు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో ఒక బయోపిక్ లో కూడా తమన్నా నటిస్తున్నట్లు సమాచారం.
