Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

ఇతర భాషల్లో సక్సెస్ సాధించినా రుక్మిణి వసంత్, మమిత బైజు, భాగ్యశ్రీ బోర్సే, ప్రతీ ముకుందన్ వంటి హీరోయిన్లకు టాలీవుడ్‌లో ఆశించిన అవకాశాలు రావడం లేదు. కేవలం సక్సెస్ మాత్రమే కాకుండా హీరో, దర్శకుడి కాంబినేషన్, పాత్ర స్వభావం, పాన్ ఇండియా అప్పీల్ వంటి అంశాలు అవకాశాలను ప్రభావితం చేస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By:  Srikanth Kontham   |   11 Nov 2026 11:29 AM IST
టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!
X

టాలీవుడ్ లో న‌టిగా నిల‌దొక్కుకోవాలంటే? సక్సెస్ రేట్ మాత్రమే ప్రామాణికం కాదనే అంశం మరోసారి బలపడుతోంది. ఇతర భాషల్లో స‌క్సెస్ అయినా? అపారమైన నటనతో ఆకట్టుకున్న కథానాయికలు కూడా టాలీవుడ్‌లో అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులున్నాయ‌న్న‌ది కాద‌న‌లేని నిజం. సక్సెస్ ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు. కాంబినేషన్లు లక్..టాలీవుడ్ మేకర్స్ పాటించే ప్రత్యేక సమీకరణాలు కూడా హీరోయిన్ల కెరీర్‌ను ప్రభావితం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కెరీర్ చూస్తే? ప్లాప్ ల్లో ఉన్న‌ప్పుడు సైతం ఎన్నో అవ‌కాశాలు అందుకుంది.

కానీ `లెనిన్` తో హిట్ అందుకున్నా? అమ్మ‌డు ఆ త‌ర్వాత కొత్త సినిమాలు చేయాలంటే ఎదురు చూడాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అంత‌కు ముందు రాఖీఖ‌న్నా టాలీవుడ్ కెరీర్ కూడా ఇలాగే సాగింది. విజ‌యాలు లేక‌పోయినా? వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుని చాలా కాలం పాటు ఇండ‌స్ట్రీలో కొన‌సాగింది. కానీ ఇమేజ్ అన్న‌ది ప్ర‌భావితం చేస్తుంది గా? ఆ ర‌కంగా కొంత కాలానికి అమ్మ‌డికి అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అనంత‌రం కోలీవుడ్ ..బాలీవుడ్ అంటూ కొత్త ప్ర‌య‌త్నాలు చేసి బిజీ అయింది.

మరో ట్యాలెంటెడ్ బ్యూటీ ప్ర‌తీ ముకుంద‌న్ కెరీర్ కూడా ఇలాగే క‌నిపిస్తుంది. `క‌న్న‌ప్ప‌`తో లాంచ్ అయిన బ్యూటీ ఎంతటి ప్ర‌తిభావంతురాలు అన్న‌ది ఆ త‌ర్వాత కాలంలో అర్ద‌మైంది. ప్ర‌స్తుతం ఒక‌టి రెండు సినిమాలు చేస్తున్నా? అవి అమ్మ‌డి ట్యాలెంట్ కు త‌గ్గ అకవ‌కాశాలు కాద‌న్న‌ది వాస్త‌వం. రుక్మిణి వసంత్, మమిత బైజు వంటి భామ‌లు ఇతర భాషల్లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. `సప్త సాగరదాచే ఎల్లో` చిత్రంతో కన్నడతో పాటు తెలుగులోనూ యమ క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ యూత్ లో ఓసంచ‌ల‌నం. కానీ ఛాన్సులు మాత్రం రావ‌డం లేదు.

అలాగే `ప్రేమలు` సినిమాతో యూత్‌లో సంచలనం సృష్టించిన మమిత బైజు గ్లామర్, న‌ట‌నా సామ‌ర్ధ్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. అయినా ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో స‌రైన అవ‌కాశాలు రావ‌డం లేద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

మ‌రి ఎందుకిలా జ‌రుగుతోందంటే? ఓ కార‌ణం తెర‌పైకి వ‌స్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఒక ప్రాజెక్ట్‌లోని హీరో, దర్శకుడి కాంబినేషన్, ఆఫర్ చేసే పాత్ర స్వభావం, పాన్-ఇండియా అప్పీల్ వంటి అనేక అంశాలు నటీమణుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నాయంటున్నారు. అలాగే సెటిల్ అయిన కొంత మంది హీరోయిన్లు బ్యాకెండ్ రాజ‌కీయాలు చేస్తున్నార‌నే వాద‌న కూడా తెర‌పైకి వ‌స్తోంది. ఆ కార‌ణంగానే మేక‌ర్స్ హీరోయిన్ల విష‌యంలో ప‌క్కాగా ముందుకెళ్ల‌లేక‌పోతున్నార‌ని టాక్ న‌డుస్తోంది.