ఖాతాలో హిట్ ఉన్నా? అవకాశాలు అందుకోలేని భామలు!
విజయం అనేది విచిత్రమైన సమీకరణం. భారీ హిట్ పడినంత మాత్రాన స్టార్‌డమ్ శాశ్వతంగా ఉంటుందనే గ్యారెంటీ లేదు.
By: Srikanth Kontham | 20 July 2026 3:00 PM ISTవిజయం అనేది విచిత్రమైన సమీకరణం. భారీ హిట్ పడినంత మాత్రాన స్టార్‌డమ్ శాశ్వతంగా ఉంటుందనే గ్యారెంటీ లేదు. ప్రతిభ ఉండి ఖాతాలో కమర్షియల్ హిట్లు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కక రేసులో వెనుకబడిపోతున్న నటీమణులు కొందరున్నారు. ప్రియాంక మోహన్, మానస వారణాసి, ప్రజ్ఞా జైస్వాల్, ఐశ్వర్య రాజేష్ , సాక్షి వైద్య వంటి నటీమణుల కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే ప్రతిభకు, అదృష్టానికి మధ్య ఉన్న సన్నని గీత అర్థమవుతుంది.
ప్రియాంక మోహన్ `నానిస్ గ్యాంగ్ లీడర్స, `డాక్టర్` వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా? ఆ తర్వాత అమ్మడకు రావాల్సిన స్థాయిలో పెద్ద ప్రాజెక్టులు దక్కలేదు. సహజమైన నటనతో ఆకట్టుకున్నప్పటికీ సరైన బ్రేక్ కోసం ఇంకా వేచి చూడాల్సి వస్తోంది. అలాగే అందం, అభినయం ఉన్నా ప్రజ్ఞా జైస్వాల్ `అఖండ` లాంటి భారీ హిట్ తర్వాత కూడా ఆ ఊపును కొనసాగించలేకపోయారు. గ్లామర్ పాత్రలతో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసినా? ఆమెకు అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇక ఐశ్వర్య రాజేష్ పరిస్థితి మరోలా ఉంది. కెరీర్ మొదట్లో `కౌసల్య కృష్ణమూర్తి` కొంత కాలానికి` సంక్రాంతి వస్తున్నాం` వంటి చిత్రాలతో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందుతున్నా? కమర్షియల్ సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు తక్కువగా దక్కుతున్నాయి. అలాగే మానస వారణాసి, సాక్షి వైద్య వంటి వారు కొన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకులకు పరిచయమైనా? వారు ఇంకా తమ స్థానాన్ని పరిశ్రమలో సుస్థిరం చేసుకోలేకపోతున్నారు.
ఈ భామల పరిస్థితికి కారణాలు ఏమైనా కావొచ్చు. దర్శక నిర్మాతల ఎంపిక, కథాంశాలు, అదృష్టం వంటి అంశాలు నటి కెరీర్‌ను నిర్ణయిస్తాయి. ఒక సినిమా విజయం తర్వాత మరో సినిమా ఎంపికలో తీసుకునే జాగ్రత్తలు కొన్నిసార్లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్ల మధ్య ఉన్న పోటీలో తాము చేసిన పాత్రలు గుర్తుండిపోయేలా ఉన్నా? ఆ తర్వాతి అడుగు వేయడంలో తడబాటు సహజం.
అయితే ఈ నటీమణులందరూ తమకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నారు. సరైన కథాంశం , దర్శకుడు దొరికితే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. పరిశ్రమలో ఎప్పుడూ ఒకే విధమైన గమనం ఉండదు. నేడు వెనకబడినట్లు కనిపించిన వారే? రేపు పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం చూస్తుంటాం. వీరిలో ఉన్న ప్రతిభకు తగిన గుర్తింపు రావడం సమయం ..సరైన ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది.
చివరిగా ఖాతాలో ఎన్ని హిట్లు ఉన్నా అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి సినిమా రంగంలో కొత్తేమీ కాదు. ఇది నిరంతర పోరాటం. నిలకడగా రాణించడం అనేది నటనపైనే కాకుండా, మార్కెటింగ్, పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతిభను కాస్త అదృష్టం కూడా తోడైతే? కచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు.
