Begin typing your search above and press return to search.

పాత చింతకాయ కథలపై తాప్సీ పన్ను అసహనం!

బాలీవుడ్‌లో 90ల నాటి స్వచ్ఛమైన ప్రేమకథలు మళ్లీ రావాలని తాప్సీ ఆకాంక్షించారు. ప్రస్తుత సినిమాల్లో హీరోయిజం, టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌కు ప్రాధాన్యం పెరిగిందని, నిజమైన భావోద్వేగాలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. భర్త మథియాస్ బోతో తమది 13 ఏళ్ల ప్రేమబంధమని, పరస్పర నమ్మకమే దానికి బలమని తెలిపారు.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 3:34 PM IST
పాత చింతకాయ కథలపై తాప్సీ పన్ను అసహనం!
X

ఒకప్పుడు బాలీవుడ్ లో ల‌వ్ స్టోరీలు ఎంత వైభ‌వంగా ఉండేవో చెప్పాల్సిన ప‌నిలేదు. వెండి తెర‌పై ప్రేమ‌ను అద్బుతంగా ఆవిష్క‌రించేవారు. ఎంతో రియ‌లిస్టిక్ గా ఆ క‌థలు క‌నిపించేవి. ఆయా పాత్ర‌ల్లో న‌టీన‌టులు సైతం అంతే ఒదిగిపోయేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది ప్రేమ క‌థ‌ల్లో స్వ‌చ్చ‌త త‌గ్గిపోతుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. తాజాగా ఇదే విష‌యాన్ని తాప్సీ తెర‌పైకి తెచ్చింది. లవ్ స్టోరీలు.. రొమాంటిక్ కామెడీ సినిమాల ట్రెండ్ కనుమ రుగైపోవడంపై తాప్సీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 90ల తరం క్లాసిక్ లవ్ మూవీస్‌ను ఎంతగానో మిస్ అవుతు న్నానన్నారు.

కెమెరా యాంగిల్స్.. గ్లామర్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం మాని తెరపై కనిపించే ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన భావోద్వేగాలపై దృష్టి పెట్టాల్సిన సమయం మ‌ళ్లీ ఆస‌న్న‌మైంద‌ని అభిప్రాయపడ్డారు. కులాలు-మతాల మధ్య గొడవలు అనే పాత చిత్తు కాన్సెప్ట్‌లనే తిప్పి తిప్పి తీస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత సాంకేతికత యుగంలో ప్రేమ పుట్టే విధానం పూర్తిగా మారిపోయిందని.. నేటి తరానికి తగినట్లుగా రిలేషన్‌షిప్ సమస్యలను ప్రతిబింబించే కొత్త కథలు రావాలని ఆకాక్షించారు.

ముఖ్యంగా ప్రస్తుత సినిమాల్లో అతిగా హీరోయిజం చూపించడం ..టాక్సిక్ రిలేషన్‌షిప్‌లను హైలైట్ చేయడం జరుగుతోందని ఆ రెండింటికి మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను చూపించడం కొరవడిందని అభిప్రాయ‌ప‌డ్డారు. తాను ఎక్కువగా సీరియస్ - వైవిధ్యమైన పాత్రలు చేసినా? భవిష్యత్తులో మంచి లవ్ స్టోరీలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తాప్సీ తెలిపారు. బాలీవుడ్‌లో ప్రతి ఒక్కరిలోనూ సహజంగానే ఒక ఫిల్మీ నేచర్ ఉంటుందని.. అయితే నటులు కెమెరా ముందు తమ లుక్స్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారన్నారు.

ఎలాంటి డార్క్ ట్విస్టులు, సామాజిక సందేశాలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిన `మన్మర్జియాన్` సినిమాకు ఇప్పటకీ కల్ట్ ఫాలోయింగ్ ఉందని.. అలాంటి ప్యూర్ రొమాంటిక్ మూవీస్ మళ్లీ రావాలని కోరుకుం టున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తాప్సీ రియ‌ల్ ల‌వ్ స్టోరీ గురించి కొంత ఓపెన్ అయింది. భర్త, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో రిలేషన్‌షిప్ చాలా పాత పద్ధతిలోనే సాగిందంది.

13 ఏళ్లుగా కలిసి ఉన్నామ‌ని.. ఆ కాలంలోనే ఒకరికోసం ఒకరు ప్రత్యేకంగా అర్దం చేసుకున్నామ‌ని.. స్వచ్ఛమైన ప్రేమ తమ మధ్య ఉందని తెలిపారు. అలాగే నేటి ట్రెండ్‌లో నడుస్తున్న ఆధునిక డేటింగ్ పోకడలు తనకు ఎప్పుడూ నచ్చలేదని.. తమ మధ్య ఉన్న నమ్మకమే ఇన్ని సంవత్సరాల బంధానికి బలమని తాప్సీ వెల్లడించారు.