శారీలో తాప్సీ పన్ను.. రాయల్ లుక్‌తో మతిపోగొట్టేసింది!
టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి
By: Madhu Reddy | 6 Oct 2026 9:48 PM ISTటాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. "ది గ్లో అండ్ ది గేజ్. ఆ చూపులు అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. సినిమాల పరంగా వరుస విజయాలు అందుకుంటూ, అటు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ భామ.. తాజాగా ఐవరీ షాంపైన్-గోల్డ్ శారీలో అచ్చం అప్సరసలా మెరిసిపోతూ కుర్రకారును కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోషూట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.ఆ విశేషాలు చూద్దాం..
ఐవరీ షాంపైన్-గోల్డ్ టిష్యూ ఆర్గాంజా శారీ లుక్:
తాజా ఫోటోషూట్ కోసం తాప్సీ పన్ను ఎగసిపడే కెరపాల వంటి ప్రవాహంలాంటి ఐవరీ షాంపైన్-గోల్డ్ ప్యూర్ టిష్యూ ఆర్గాంజా చీరను ఎంచుకుంది. పల్లు మరియు అంచుల వెంబడి దట్టంగా అల్లిన మెరిసే గోల్డ్-ఎంబ్రాయిడరీ స్టేట్‌మెంట్ బార్డర్ ఈ చీరను మరింత రాయల్‌గా మార్చింది. ఇక దీనికి సరిగ్గా సరిపోయేలా స్ట్రాప్‌లెస్, హెవీగా ఎంబెర్నింగ్ చేసిన స్వీట్‌హార్ట్ కార్సెట్ చోలీ ధరించి అద్భుతమైన మోడ్రన్ టచ్ ఇచ్చింది.
స్టేట్‌మెంట్ జ్యువెలరీ అండ్ మెటాలిక్ క్లచ్ :
ఈ ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ ఫ్యూజన్ లుక్‌ను మరింత హైలైట్ చేయడానికి తాప్సీ ప్రత్యేకమైన ఆభరణాలను ఎంచుకుంది. భారీ ఎథ్నిక్ ఇయర్ రింగ్స్, చేతికి గోల్డ్ మ్యాచింగ్ బ్రాస్‌లెట్ అలాగే చేతిలో మెటాలిక్ గోల్డ్ క్లచ్ బ్యాగ్ ధరించి పర్ఫెక్ట్ రిచ్ లుక్‌లో కనిపించింది. ఇక ఆమె గ్లోయింగ్ మేకప్, కాన్ఫిడెంట్ లుక్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్ "ప్రిటీయెస్ట్", "గోర్జియస్", "ఎలిగెంట్ అండ్ క్లాసిసి బ్యూటీ", "లుకింగ్ నైస్లీ" అంటూ కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
'పింక్', 'థప్పడ్' నుంచి 'గాంధారి' వరకు ప్రయాణం :
తమిళంలో 'ఆడుకలం', హిందీలో 'చష్మే బద్దూర్' చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన తాప్సీ, 'బేబీ', 'పింక్' చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 'థప్పడ్' చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకోవడంతో పాటు షారుఖ్ ఖాన్ సరసన 'డంకీ' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆమె యాక్షన్-థ్రిల్లర్ 'గాంధారి' చిత్రంలో ఒక దృఢ సంకల్పం గల తల్లిగా నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.
రికార్డుల మోత.. 'హార్పర్స్ బజార్' అవార్డు:
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన 'గాంధారి' చిత్రం విడుదలైన తొలి మూడు వారాల్లోనే ఏకంగా 18.8 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ విజయాల జోరులో ఉన్న తాప్సీకి తాజాగా ‘హార్పర్స్ బజార్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – 2026’ పురస్కారం కూడా దక్కింది. త్వరలో 'వో లడ్కీ హై కహా?' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నటనలో వైవిధ్యం చూపుతూనే, ఫ్యాషన్ ఐకాన్‌గా రాణిస్తున్న తాప్సీ పన్ను, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులతో మరింత పెద్ద విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
