రెడ్ హాట్ థై స్లిట్ ఫ్రాక్‌లో తాప్సీ ఫోజులు
ఇదిలా ఉంటే తాప్సీ పన్ను ఇటీవల వరుస ఫోటోషూట్లతో మతులు చెడగొడుతోంది. కుర్రకారును మత్తులోకి దించేయడానికి సంకోచించడం లేదు.
By: Sivaji Kontham | 1 Nov 2025 10:41 PM ISTఅందమైన రింగుల జుత్తు.. తీక్షణమైన చూపులు.. మత్తు చల్లే థై స్లిట్ ఫ్రాకు.. అల్ట్రా గ్లామ్ ఎలివేషన్ తో కట్టి పడేస్తోంది తాప్సీ పన్ను. మాథియాస్ బోని పెళ్లాడి పూర్తిగా విదేశాలలో సెటిలైపోయిందని భావిస్తుంటే, తాప్సీ ఉన్నట్టుండి వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాప్సీ ఇంకా నటనను వదిలేయలేదు. కేవలం తన భర్త నివశించే చోట తన బంధాన్ని బలోపేతం చేస్తున్నానని చెప్పింది. అత్త మామ, భర్తతో కలిసి ఒకే ఇంట్లో నివశిస్తున్నామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దీనికోసం కొన్ని నెలల పాటు అత్తమామలతో నివశిస్తున్నానని కూడా చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే తాప్సీ పన్ను ఇటీవల వరుస ఫోటోషూట్లతో మతులు చెడగొడుతోంది. కుర్రకారును మత్తులోకి దించేయడానికి సంకోచించడం లేదు. తాజాగా రెడ్ హాట్ థై స్లిట్ ఫ్రాకులో తాప్సీ ఫోజులు గుబులు రేపుతున్నాయి. హిప్ నుంచి థై వరకూ, థై నుంచి పాదాల వరకూ తన అందాలను ఎలివేట్ చేయడానికి తాప్సీ వెనకాడలేదు. ఎంపిక చేసుకున్న రెడ్ హాట్ గౌనులో తాప్సీ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇన్ స్టంట్ గా ఈ ఫోటోషూట్ పెద్ద హిట్టు కొట్టింది. తాప్సీ ఈ కొత్త రూపం చూశాక దివంగత అందాల రాణి మర్లిన్ మన్రోను తలపిస్తోందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. మర్లిన్ రింగుల జుత్తు సౌందర్యం గురించి కూడా గుర్తు చేసుకుంటున్నారు.
తాప్సీ పన్ను ఇప్పటికీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. `ఖేల్ ఖేల్ మెయిన్` తర్వాత మరో మూడు కొత్త హిందీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. 2026లోను తాప్సీ డైరీ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఫోటోషూట్లతోను అభిమానులకు అవసరమైన ట్రీట్ ఇస్తూనే ఉంది.
