Begin typing your search above and press return to search.

పురుషాధిక్యతపై తాప్సీ ఊహించని కామెంట్స్.. ఎప్పటికీ మారదు అంటూ!

ముఖ్యంగా షూటింగ్ సమయంలో నేను నేలపై పడుకుని ప్రదర్శన ఇచ్చే సమయంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాను.

By:  Madhu Reddy   |   29 Aug 2026 4:19 PM IST
పురుషాధిక్యతపై తాప్సీ ఊహించని కామెంట్స్.. ఎప్పటికీ మారదు అంటూ!
X

మంచు మనోజ్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ. ఆ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది కానీ స్టార్ హీరోయిన్ హోదా లభించలేదు. దీంతో బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దుగుమ్మ. అక్కడే పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తాప్సీ తాజాగా హిందీలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ గాంధారి. అంధురాలైన తల్లిపాత్రలో తాప్సి నటిస్తోంది . కిడ్నాప్ కి గురైన తన కూతుర్ని కాపాడుకోవడానికి ఒక తల్లి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? చైల్డ్ ట్రాఫికింగ్ , మాఫియా పై ఎలాంటి పోరాటం సాగించింది? అనే కోణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 3న నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఒకవైపు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకవైపు వరుస ప్రమోషన్స్ లో పాల్గొన్న తాప్సీ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది ? పురుషాధిక్యత ప్రభావం ఇండస్ట్రీపై ఎలా ఉంది? ముఖ్యంగా తాను నటించిన తొలి సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఇలా ప్రతి విషయాన్ని కూడా ఆమె పంచుకున్నారు.

తాప్సీ పన్ను మాట్లాడుతూ.." నేను నా మొదటి సినిమాకు సంతకం చేశాను.. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు సెట్లో నేనొక్కదాన్నే మహిళ. అక్కడికి వెళ్ళగానే సెట్లో ఒక మూలకి ఒక ప్లాస్టిక్ కుర్చీ వేసారు. ఆ సమయంలో నాకు వ్యక్తిగత సిబ్బంది ఎవరూ లేకపోవడంతో నిర్మాత కేటాయించిన ఒక స్పాట్ బాయ్ మాత్రమే నాతో ఉండేవాడు. ముఖ్యంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి, నాతో కూర్చోవడానికి ఎవరు ఇష్టపడలేదు. నేను ఒక కొత్త నటిని. మొదట్లో ఏ సినిమా సెట్ లో అయినా సరే ఇలాగా ఉంటుందా అనుకున్నాను.

ముఖ్యంగా షూటింగ్ సమయంలో నేను నేలపై పడుకుని ప్రదర్శన ఇచ్చే సమయంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాను. షూటింగ్ సమయంలో ఒక ట్రాలీపై ఫోకస్ పుల్లర్ అలాగే కెమెరామెన్ కూర్చొని ఉంటారు. వాళ్లు తమ శరీరంపై అక్కడక్కడ గోకుతూ కనిపించడం చూసి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను నటిస్తున్న సమయంలో నిజంగానే నేను ఇంత తక్కువా అని అనుమానం కలిగింది. చాలా తక్కువ చేసి మాట్లాడారు. నాకు ఇలాంటి అనుభవాలు, విచిత్రమైన సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి.

గట్టిగా చెప్పాలి అంటే ఇండస్ట్రీలో లింగ భేదం చాలా ఎక్కువగా ఉంది. వసతి, రవాణా విషయంలో కూడా పురుష, మహిళ నటుల పట్ల చూసే విధానంలో ఎన్నో తేడాలు ఉన్నాయి. హీరోలతో ఒకే చోట షూటింగ్ చేస్తున్నప్పటికీ హీరోయిన్లు తరచుగా హీరోల కంటే ముందుగానే సెట్ కి రావాలని ఆశిస్తారు. లొకేషన్ కే కాదు.. సెక్స్ కూడా ఎప్పుడు హీరోల కంటే హీరోయిన్ లనే ముందుగా రమ్మని పిలుస్తారు. ముఖ్యంగా హీరోయిన్ సెట్ కి వచ్చిన తర్వాతే హీరోని అసిస్టెంట్లు పిలుస్తారు. ఇక ఈ లింగ బేధం కారణంగానే హీరోలకు హీరోయిన్లకు ఎప్పుడూ కూడా ఒకే రకమైన హోటల్ గదులు, కార్లు ఇవ్వరు" అంటూ ఇండస్ట్రీ కొత్తలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది తాప్సీ. ఇండస్ట్రీలో ఈ ధోరణి ఎప్పటికీ మారదు అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.