Begin typing your search above and press return to search.

గాంధారి స్క్రిప్ట్ వివాదంపై నెట్ ప్లిక్స్ వివ‌ర‌ణ‌!

తాప్సీ ప్రధాన పాత్రలో దేవ‌శిశ్ మ‌గ్జీ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న `గాంధారి` సినిమా చుట్టూ కాపీ రైట్ వివాదం అలుముకుంటోంది.

By:  Srikanth Kontham   |   26 Aug 2026 11:51 AM IST
గాంధారి స్క్రిప్ట్ వివాదంపై నెట్ ప్లిక్స్ వివ‌ర‌ణ‌!
X

తాప్సీ ప్రధాన పాత్రలో దేవ‌శిశ్ మ‌గ్జీ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న `గాంధారి` సినిమా చుట్టూ కాపీ రైట్ వివాదం అలుముకుంటోంది. త‌మ స్క్రిప్ట్‌ను చోరీ చేశారంటూ ఓ రైటర్ చేసిన ఆరోపణలు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తరఫున కంటెంట్ హెడ్ రుచికా కపూర్ ఆరోపణలపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. వివ‌రాల్లోకి వెళ్తే... కళ్యాణ్ బండి అనే రచయిత తమ `గాంధారి` కథను కాపీ కొట్టారని.. అసలు స్క్రిప్ట్‌ను దొంగిలించారంటూ బహిరంగంగా ఆరోపించారు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేకర్స్ అప్రమత్తమయ్యారు. సినిమా నిర్మాణంపై, రచయితల ప్రతిష్టపై వస్తున్న ఈ నిరాధారమైన విమర్శలను నెట్‌ఫ్లిక్స్ తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పందించిన రుచికా కపూర్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. రచయిత కనికా ధిల్లాన్ - నటి తాప్సీ కలయికలో వ‌స్తోన్న `గాంధారి` పూర్తిగా తమ స్వంత సృష్టి అని రుచికా కపూర్ స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి, క్రియేటివ్ ఆలోచనలతో కథను రూపొందించామని, ఇతరుల స్క్రిప్ట్‌లను కాపీ చేయాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పారు.

సోషల్ మీడియా వేదికగా వ‌స్తోన్న‌ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రేక్షకులను కోరారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సృజనాత్మక రంగంలో పనిచేసే కళాకారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని సినీ అభిప్రాయపడ్డారు. ఒక సినిమా సెట్స్ మీదికి వెళ్లే తరుణంలో ... విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు రావడం ప్రాజెక్ట్ బజ్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయినా? మేకర్స్ ముందుగానే స్పందించి స్పష్టత ఇవ్వడంతో వివాదానికి సకాలంలో తెరపడినట్లయింది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గాంధారీ క‌థ‌ను తెర‌పై మ‌లిచారు? ఆ క‌థ ఎలా ఉండ‌బోతుంది? అన్న ఆస‌క్తి నెల‌కొంది.

సెప్టెంబ‌ర్ 3న నెట్ ప్లిక్స్ వేదిక‌గా రిలీజ్ అవుతున్న గాంధారీ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి. ఓటీటీలో రిలీజ్ అవుతున్నా ప్ర‌చారం మాత్రం పెద్ద ఎత్తున నిర్వ హించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో థియేట్రిక‌ల్ రిలీజ్ కంటే ఓటీటీ కంటెంట్ కే ఎక్కువ ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో ప్ర‌చారం కోసం నిర్వాహ‌కులు భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. తాప్సీ కెరీర్ కూడా టాలీవుడ్ ను వ‌దిలి బాలీవుడ్ కు వెళ్లిన నాటి నుంచి బాగానే కొన‌సాగుతుంది. ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా ఇక్క‌డ అమ్మ‌డు అనుకున్నంత‌గా స‌క్సస్ అవ్వ‌లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం న‌టిగా బిజీగానే గ‌డుపుతోంది.