భర్తతో డెన్మార్క్‌లో సెటిలైనట్టేనా? తాప్సీ ఎందుకింత సీరియస్!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన `ఝుమ్మందినాదం` చిత్రంతో కథానాయికగా పరిచయమైంది తాప్సీ పన్ను.
By: Sivaji Kontham | 25 Oct 2025 9:15 AM ISTదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన `ఝుమ్మందినాదం` చిత్రంతో కథానాయికగా పరిచయమైంది తాప్సీ పన్ను. టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఎదగాలని కలలు కంది. కానీ దురదృష్టవశాత్తూ ఆశించినది జరగలేదు. ముఖ్యంగా తాప్సీ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్నా కానీ, మెగా కాంపౌండ్ హీరోల సరసన అవకాశాలు అందుకోలేకపోయింది. కారణం ఏదైనా తాప్సీ పన్ను ఆశించిన స్టార్ డమ్ ని అందుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత తమిళంలోను కొన్ని ప్రయత్నాలు సఫలమైనా కానీ, సూపర్ స్టార్ రేంజును చేరుకోలేదు.
సౌత్ లో ఆడినంతకాలం ఆడిన తాప్సీ, ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ కూడా బాక్సాఫీస్ హిట్లు లేకపోయనా క్రిటికల్ గా నటన పరంగా మంచి పేరు తెచ్చిన చిత్రాల్లో నటించింది. ఇటీవల సొంత బ్యానర్ ప్రారంభించి, రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులతో ఎంటర్ ప్రెన్యూర్ గాను తాప్సీ ప్రయత్నాలు ఆపలేదు. ఇంతలోనే తన సీక్రెట్ బోయ్ ఫ్రెండ్, క్రీడాకారుడైన మాథియాస్ బోని పెళ్లాడేసిన సంగతి తెలిసిందే.
అయితే తాప్సీ అత్త ఇంట్లో (డెన్మార్క్) అడుగుపెట్టాక ఏం జరుగుతోంది? అన్నది అంతగా అభిమానులకు సమాచారం లేదు. భర్త, అత్త మామలతో ప్రియాంక చోప్రాలా ఒక అందమైన నెస్ట్ (గూడు) ను నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నానని తాప్సీ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. గత కొంతకాలంగా చడీ చప్పుడు లేకపోవడంతో తాప్సీ పన్ను డెన్మార్క్ వెళ్లిపోయిందని ఒక పోర్టల్ కథనం ప్రచురించింది. అయితే దీనిపై తాప్సీ రుసరుసలాడింది. ఇలాంటి పుకార్లు ఎందుకు వ్యాపిస్తాయో అర్థం కావడం లేదని, తాను ముంబైలోనే ఉన్నానని ప్రూఫ్ లు కూడా చూపించే ప్రయత్నం చేసింది.
అదే సమయంలో డెన్మార్క్ లో భారతీయ సంస్కృతిని విస్తరిస్తున్నట్టు తాప్సీ చెప్పుకొచ్చింది. సహజంగానే డెన్మార్క్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఎదిగొచ్చిన పిల్లలు భార్యలతో వేరుగా వెళ్లి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. కానీ తాను అత్త మామలు, భర్తతో ఒకే ఇంట్లో ఉండేందుకు ప్రాధాన్యతనిస్తున్నానని తాప్సీ తెలిపింది. డెన్మార్క్ ఇంట్లో కింది పోర్షన్ లో అత్తమామలు హాయిగా నివశిస్తున్నారని తెలిపింది. అలాగే డెన్మార్క్ లో వేసవి కాలంలో నివశించేందుకు ఇష్టపడతానని కూడా తాప్సీ తెలిపింది.
అయితే అత్తారింట్లో విషయాలను సర్ధుబాటు చేస్తున్న తాప్సీ గురించి ఒక పోర్టల్ ప్రచురించిన కథనం ఇంతలోనే సంచలనంగా మారింది. తాప్సీ పన్ను శాశ్వతంగా డెన్మార్క్ కి వెళ్లిపోయిందనేది ఆ పోర్టల్ కథనం సారాంశం. అయితే ఈ ప్రచారంపై తాప్సీ చాలా సీరియస్ గా ఉంది. తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని, ప్రస్తుతం ముంబైలో ఉన్నానని వెల్లడించింది. ముంబైలో దోసెలు తింటున్న ఫోటోలను కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇలాంటి తప్పుదు హడ్డింగులతో తప్పు దారి పట్టించవద్దని.. ఆన్ లైన్ పోర్టళ్లలో వార్తలు వేగంగా దూసుకెళతాయని కూడా పేర్కొంది. బహుశా ఈ వేగం తగ్గించి అసలేం జరిగిందో తెలుసుకోవాలని సూచించింది. జర్నలిస్టులు పరిశోధించాకే కథనం వేయాలని అభ్యర్థించింది.
భారతదేశం - డెన్మార్క్ మధ్య ప్రయాణాల్ని మేనేజ్ చేయడంలో సవాళ్ల గురించి తాప్సీ మాట్లాడింది. సహజంగా భారతదేశంలో శీతాకాలంలో షూటింగులు జరుగుతాయి.. మనకు షూటింగులకు ఉత్తమ సీజన్ ఇది. చాలా అరుదుగా వేసవి, వర్షాకాలంలో భారత్ లో షూట్‌లు చేస్తాము. అందుకే వేసవిలో డెన్మార్క్‌లో సమయం గడుపుతాము.. వర్షాలు తగ్గినప్పుడు భారతదేశానికి తిరిగి వస్తాము.. అని తెలిపింది. దీనిని బట్టి ఏడాదిలో ఒక సీజన్ డెన్మార్క్ లో రెండు సీజన్లు ఇండియాలో గడుపుతానని తాప్సీ సెలవిచ్చింది. కానీ భర్తతో తాప్సీ డెన్మాక్ కి జంప్ అయిపోయిందని పోర్టల్ కథనం వండి వార్చింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే...చివరిగా ముదస్సర్ అజీజ్ తెరకెక్కించిన `ఖేల్ ఖేల్ మెయిన్`లో అక్షయ్ కుమార్, వాణి కపూర్, ప్రగ్యా జైస్వాల్ తదితరులతో కలిసి నటించింది. ప్రస్తుతం గాంధారి చిత్రీకరణలో బిజీగా ఉంది. దేవాశిష్ మఖిజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రివెంజ్ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కనికా ధిల్లాన్ తన బ్యానర్ `కథ పిక్చర్స్`లో నిర్మిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
