Begin typing your search above and press return to search.

అస‌లైన మ‌హిళామ‌ణిని త‌ట్టి లేపుతోన్న తాప్సీ!

స్టార్ హీరోయిన్ ఓ సినిమాకు సైన్ చేసిందంటే కోట్ల రూపాయలు ఖాతాలో జ‌మ అవుతాయి. ఏ న‌టికి జ‌యాప‌జ‌యా ల‌తో సంబంధం ఉండ‌దు.

By:  Srikanth Kontham   |   17 Jan 2026 11:00 PM IST
అస‌లైన మ‌హిళామ‌ణిని త‌ట్టి లేపుతోన్న తాప్సీ!
X

స్టార్ హీరోయిన్ ఓ సినిమాకు సైన్ చేసిందంటే కోట్ల రూపాయలు ఖాతాలో జ‌మ అవుతాయి. ఏ న‌టికి జ‌యా ప‌జ‌యాల‌తో సంబంధం ఉండ‌దు. సినిమాకు న‌ష్టం వ‌చ్చినా? లాభం వ‌చ్చినా? భ‌రించాల్సింది నిర్మాత మాత్ర‌మే. అందులోనూ నేటి జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌లో నిర్మాత లాభాల గురించి ఆలోచించే హీరోయిన్ల‌ను వెళ్ల మీద లెక్క‌పెట్టవొచ్చు. సినిమా స‌క్సెస్ ని ..ఫెయిల్యూర్ ని బాధ్య‌త‌గా తీసుకునేది అతికొద్ది మందే. సినిమాల‌పై..పోషించే పాత్ర‌ల పై ఎంత ఫ్యాష‌న్ ఉన్నా? అప్పు డ‌ప్పుడు త‌మ అధీనంలో లేకుండానే కొన్ని తప్పిదాలు జ‌రిగిపోతుంటాయి.

కానీ ఇలాంటి చిన్న‌పాటి త‌ప్పిదాలు గానీ, పారితోషికం ఆశించి గానీ, ఏ రోజు ప‌నిచేయలేదంటోంది తాప్సీ. ఇండ‌స్ట్రీలో ఎదురైన అనుభ‌వాల నుంచి తాను తెలుసుకున్న విష‌యాల‌ను అమ్మ‌డు పంచుకుంది. పరాజ‌యాలు , మ‌నో వేద‌న‌లు ఎదురైన త‌ర్వాతే ఏ దారిలో న‌డ‌వాలో తెలుసుకున్న‌ట్లు పేర్కొంది. మ‌న‌సు పూర్తిగా ఏకీభ‌వించిన చిత్రాల్లో ఉత్త‌మంగా రాణించ‌గ‌ల‌న‌ని .. అలాంటి క‌థ‌లే ప్రేక్ష‌కుల‌కు బ‌లంగా క‌నెక్ట్ అవుతాయ‌ని గ్ర‌హించానంది.

అప్ప‌టి నుంచి త‌న అంత‌రాత్మ చెప్పిన‌ట్లే వింటున్నానంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలంటే ఇప్ప‌టికే చాలా సినిమాల్లో న‌టించి కోట్ల రూపాయ‌లు వెన‌కేసేదాన్ని అంది.

త‌న‌లోని న‌ట‌నా సామ‌ర్ధ్యం పెంచే పాత్ర‌ల‌పైనే దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నానంది. ఎవ‌రు న‌డ‌వ‌ని కొత్త మార్గంలో న‌డ వాల‌నుకుంటున్నానంది. రిస్క్ ఉన్నా స‌రే తీసుకోవ‌డానికి తానెప్పుడు సిద్దంగానే ఉంటానంది. త‌న‌లో ఉన్న అస లైన స్త్రీకి న‌చ్చే చిత్రాల్లో మాత్ర‌మే ప‌ని చేస్తానంది. జీవితం ప‌ట్ల త‌న దృక్ఫ‌ధం చాలా వ‌ర‌కూ ఓ మ‌హిళా కోణం నుంచే ఉంటుందంది. ఇవ‌న్నీ ఎన్నో వైఫ‌ల్యాల త‌ర్వాత వ‌చ్చిన అనుభ‌వాలుగా పేర్కొంది. కెరీర్ ఆరంభంలో ఉన్న త స్థానానికి చేరుకోవా లంటే ఎంచుకున్న పాత్ర‌లే ఆస్థానంలో కూర్చోబెడ‌తాయ‌ని కొంద‌రు చెప్పారంది.

కానీ వాటిలో చాలా వ‌ర‌కూ తాను చేసిన ఏ పాత్ర‌లు వ‌ర్కౌట్ అవ్వ‌లేదంది. అందుకు కార‌ణం త‌న జ‌డ్జిమెంట్ కంటే ఇత‌రులు జ‌డ్జిమెంట్ కి ప్రాధాన్యం ఇవ్వ‌డం ఓ కార‌ణమంది. అప్ప‌టి నుంచి వేరే వాళ్ల మాట‌లు విన‌కుండా సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. అలా క‌థ‌ల ఎంపిక మొద‌లు పెట్టి నాటి నుంచి కెరీర్ లో మార్పు మొద‌లైంద‌ని తెలిపింది. అలాగే ట్రెండ్ గురించి ఎప్పుడూ పట్టించుకోనంది. ట్రెండ్ అన్న‌ది కొన్ని నెల‌ల పాటే కొన‌సాగు తుంద‌ని..ఆ త‌ర్వాత మ‌రో కొత్త ట్రెండ్ మొద‌ల‌వుతుందంది. ఇలా ట్రెండ్ ప‌ట్టుకుని సినిమాలు చేయ‌డం అన్న‌ది దండ‌గ అనేసింది తాప్సీ.