తాప్సీని బాలీవుడ్ నమ్మడం లేదా?
టాలీవుడ్, బాలీవుడ్ లో తాప్సీ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 ఏళ్లగా సినిమా రంగంలో కొనసాగుతుంది.
By: Srikanth Kontham | 19 Feb 2026 7:00 PM ISTటాలీవుడ్, బాలీవుడ్ లో తాప్సీ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 ఏళ్లగా సినిమా రంగంలో కొనసాగుతుంది. తొలుత టాలీవుడ్ ఎంట్రీ అటుపై తమిళ, మలయాళ చిత్రాల్లో నటించడం అంతా తెలిసిందే. ఈ మూడు పరిశ్రమల్లోనూ తాప్సీ పెద్దగా సాధించింది లేదు. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కానీ తనుకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. వైఫల్యాలు కూడా ఈ రేసులో అమ్మడిని బాగా వెనక్కి నెట్టాయి. దీంతో లాభం లేదనుకున్న అమ్మడు బాలీవుడ్ కి వెళ్లిపోయింది. దక్షిణాదిన క్లిక్ అవ్వకపోయినా? బాలీవుడ్ లోనైనా తాను అనుకున్నది సాధించాలనుకుంది.
ఆ రకంగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. చాలా సినిమాల్లో నటించింది. ఎంతో మంది స్టార్స్ తో భాగమైంది. కానీ అక్కడా సక్సెస్ తీరాన్ని ఇంకా చేరుకోలేదు. కొన్నేళ్లగా బాలీవుడ్ లోనే పని చేస్తూనే శ్రమ తప్ప ఫలించడం లేదు. తాప్సీ మార్క్ మాత్రం వేయకలేకపోతుంది. ఈ క్రమంలో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించింది. క్రియేటివ్ కాన్సెప్ట్ లను నిర్మిస్తూ కొత్త వారికి అవకాశాలు బాగానే కల్పిస్తుంది. ఆ రకంగా అమ్మడిపై పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. కానీ ఏం లాభం నటిగా మాత్రం తాను చేరాలనుకున్న హైట్స్ మాత్రం చేరలేకపోతుంది.
తెలుగు సినిమాల్లో ఇదే పరిస్థితి ఎదురైన క్రమలో కొంత నెగిటివిటీని కూడా వ్యక్తం చేసింది. ట్యాలెంట్ కు తగ్గ అవకాశాలు , పాత్రలు పడలేదని అంసంతృప్తిని వ్యక్తం చేసింది. తాజాగా అమ్మడు బాలీవుడ్ పై తీవ్రమైన అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. తన మనసుకు నచ్చిన కథలు ఎన్నో ఉన్నా? వాటిని తెరకెక్కించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపించింది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలైతే మరీ దారు ణమైన పరిస్థితుల్లో ఉన్నాయంది. ఎంతో క్రియేటివిటీ ఉన్న కథలకు సరైన అవకాశం దక్కడం లేదంది.
ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకుల మద్దతు అవసరం. వారంతా ఇలాంటి సినిమాలు కావాలని డిమాండ్ చేస్తే తప్ప ముందుకొచ్చే పరిస్థితితుల లేవంది. కథల విషయంలో ప్రేక్షకుల ఆలోచన పట్టుకోవడం కూడా కష్టంగా మారిందంది. ఒకప్పుడు ఒకే జానర్ సినిమాలు ఎన్ని చేసినా వాటిలో వైవిథ్యత ఉంటే చూసేవారంది. కానీ నేడు ప్రక్షకుల్ని అంచనా వేయడం అసాధ్యమే. ఏ కథ కనెక్ట్ అవుతుంది? ఏది కనెక్ట్ అవ్వదు? అన్నది సులభంగా జడ్జ్ చేయలేకపోతున్నామంది. రెండేళ్లగా తాప్సీ సినిమాల జోరు కూడా తగ్గింది. 2024వరకూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు ఇప్పుడంత బిజీగా సినిమాలు చేయలేదు. ప్రస్తుతం చేతిలో ఉన్నవి రెండు ప్రాజెక్ట్ లే.
