తాప్సీ 'బేబి' లో దాగి ఉన్న అసలు నిజం
తాప్సీ తన నోట్ లో ఇలా రాసింది. ``11 ఏళ్లు అయింది.. అప్పట్లో స్పై సినిమాలు (గూఢచారి చిత్రాలు) ప్రతి శుక్రవారం వచ్చే ట్రెండ్ కాదు.
By: Sivaji Kontham | 25 Jan 2026 12:00 PM ISTతాప్సీ పన్ను నోట `బేబి` అనే మాట వినిపించింది. అయితే `బేబి` అని ప్రేమగా అనగానే, పెళ్లి తర్వాత శుభవార్త చెబుతోంది! అంటూ కొందరు నెటిజనులు గుసగుసలాడారు. అయితే అసలు ఈ పిలువు వెనక అసలు సంగతి ఏమిటి? అంటే.. దీనికి సమాధానం వేరుగా ఉంది.
నిజానికి తాప్సీ పన్నుకు బిడ్డ పుట్టలేదు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో `బేబి` (Baby) అని మాత్రమే ప్రస్తావించింది ఇదంతా తనకు పుట్టబోయే బేబి గురించి కాదు.. తన సినిమా గురించి. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన `బేబీ` సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందించిన స్పై థ్రిల్లర్ బేబి (2015) విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాప్సీ ఒక పోస్ట్ చేశారు.
తాప్సీ తన నోట్ లో ఇలా రాసింది. ``11 ఏళ్లు అయింది.. అప్పట్లో స్పై సినిమాలు (గూఢచారి చిత్రాలు) ప్రతి శుక్రవారం వచ్చే ట్రెండ్ కాదు. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది!`` అని తాప్సీ రాశారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన `ధురంధర్` స్పై సినిమా భారీ వసూళ్లను సాధించింది. ``ప్రతి శుక్రవారం వచ్చే ట్రెండ్ కాదు`` అని వ్యాఖ్యానించడం వెనక `ధురంధర్` విజయాన్ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించడమేనని .. ఆ సినిమా సక్సెస్‌ను చూసి తాప్సీ అసూయ పడుతోందని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఇటీవల వస్తున్న స్పై సినిమాలన్నిటినీ ఒకే గాటన కట్టేసి తాప్సీ చేసిన కామెంట్ కి చాలా మంది ఫీలయ్యారు. అలా హర్టయిన వారంతా తాప్సీపై విరుచుకుపడుతున్నారు. ఇది కేవలం రణవీర్ సింగ్ దురంధర్ సినిమా గురించే కాదు. సల్మాన్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ల గురించి కూడా. వాస్తవానికి తాప్సీ పన్ను అనురాగ్ కశ్యప్ శిష్యురాలు. తన గురువు ఇటీవల బాలీవుడ్ రాజకీయాలను తట్టుకోలేక సౌత్ కి వెళ్లిపోయాడు. ఇప్పుడు తాప్సీ కూడా తన సినిమాలకు తానే నిర్మాతగా మారింది. తనకు తానుగానే మనుగడ సాగించాల్సిన స్థితి కనిపిస్తోంది. అందుకే తన ముందు ఉన్న పరిస్థితుల గరించి ఓపెన్ గా తాప్సీ ఇలా మాట్లాడుతోంది. తనలోని అసహనాన్ని కూడా ఏదో ఒక విధంగా బయటపెడుతోంది.
తాప్సీ ప్రస్తుతం `అస్సి` అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. దీని మోషన్ పోస్టర్ ఈనెలలోనే విడుదలైంది. అన్నట్టు అక్షయ్ కుమార్ బేబి సీక్వెల్ ని తెరకెక్కిస్తే , ఆ సీక్వెల్ లో నటించేందుకు తాప్సీ సిద్ధంగా ఉందా?
