స్విమ్‌సూట్ లేకుండా ఫుట్‌బాల్స్‌తో!
ప్రముఖ అంతర్జాతీయ క్రీడా సంబంధిత కంపెనీ నోవిగ్ ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతోంది.
By: Ramesh Palla | 15 Sept 2026 12:57 PM ISTప్రముఖ అంతర్జాతీయ క్రీడా సంబంధిత కంపెనీ నోవిగ్ ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇటీవల ఈ కంపెనీ యాడ్స్ వల్ల అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈసారి ఈ కంపెనీ మాత్రమే కాకుండా అమెరికన్ నటి, యుఫోరియా సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న నటి సిడ్నీ స్వీనీ సైతం విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే యుఫోరియాలోని సీన్స్‌తో పాటు కొన్ని ఇతర కంపెనీ యాడ్స్ కారణంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న సిడ్నీ స్వీనీ ఈసారి నోవిగ్ కంపెనీ కోసం చేసిన అంగాంగ ప్రదర్శన తీవ్రమైన విమర్శలకు తెర తీసినట్లు అయింది. ఆట వస్తువులను అడ్డుగా పెట్టుకుని వస్త్రాలు లేకుండా ఈమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో తీవ్రమైన దుమారం రేపుతున్నాయి. ఇలా చేసి ఒక కంపెనీని ప్రమోట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
సిడ్నీ స్వీనీ ఫోజ్‌లపై అంతర్జాతీయ స్థాయి మహిళా క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడలను ప్రమోట్ చేయడానికి మహిళల శరీరాలను చూపించాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఒలింపిక్ స్వర్ణ విజేత అరియార్న్ టిట్మస్ ఈ విషయమై తీవ్రంగా స్పందించింది. నోవిగ్ కంపెనీ తీరుతో పాటు, యాడ్ ను షూట్ చేసిన వారిని సైతం ఆమె విమర్శించారు. క్రీడలను జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం మహిళలను అడ్డు పెట్టుకోవడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ కంపెనీ యొక్క కంటెంట్ ను వెంటనే సోషల్ మీడియాతో పాటు, అన్ని చోట్ల నుంచి తొలగించి మహిళల గౌరవం కాపాడాల్సిందిగా డిమాండ్ చేసింది. మహిళలను కించపరుస్తూ, వారి శరీరాలను ఉపయోగించి ఆటలను ప్రమోట్ చేయడం అనేది మొత్తం మహిళలను అవమానించినట్లు అవుతుంది అంది.
సోషల్ మీడియాలో టిట్మస్ మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో క్రీడాకారులు ఈ విషయమై స్పందించారు. ఆట ను జనాల్లోకి తీసుకు వెళ్ళాలి అంటే ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాలి, లేదంటే ఆటగాళ్లతో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఒక నటితో ఆటను ప్రమోట్ చేయడం, అది కాకుండా పూర్తి నగ్నంగా యాడ్స్ ను క్రియేట్ చేయడం ద్వారా ఆట అనేది అందరికి కాకుండా పోతుందని చాలా మంది అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సిడ్నీ స్వీనీ కి అభిమానులు ఉన్నారు. వారు సైతం నోవిగ్ కంపెనీ కోసం ఆమె ఇచ్చిన ఫోటో షూట్ ను తప్పుబడుతున్నారు. సినిమా లేదా సిరీస్ కాకుండా అంతగా యాడ్ కోసం అంగాంగ ప్రదర్శన చేయడం అనేది ఎంత వరకు సమంజసం అనేది ఆమె అర్థం చేసుకోవాలి అంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడారంగంలో మహిళలు అందరిని కించ పర్చే విధంగా సిడ్నీ స్వీనీ ఫోటో ఫోజ్‌లు ఉన్నాయి అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో పాటు, దేశీయ ఆటగాళ్లు సైతం విమర్శలు చేస్తున్నారు. మహిళల ఆటలతో పాటు, వారికి సంబంధించిన అన్ని విషయాలను గురించి సిడ్నీ స్వీనీ తన యాడ్‌లోనే చూపించినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మహిళా లోకంకు ఆమె ప్రాతినిధ్యం వహించినట్లుగా ఆ యాడ్ ఉందని కొందరు అంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సిడ్నీ స్వీనీ యొక్క నోవిగ్ ఫోటో షూట్ వివాదం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. నోవిగ్ కంపెనీ వారు ఆ యాడ్ ను, ఆ ఫోటో స్టిల్స్ ను తొలగిస్తే తప్ప వివాదం ఆగే పరిస్థితి లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నోవిగ్ కంపెనీ, సిడ్నీ స్వీనీ లు ఈ విషయమై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
