ప్రపంచ సినీ ఇండస్ట్రీలో ఇదో రికార్డ్.. ఆ నటికి రూ.530 కోట్లు రెమ్యూనరేషన్.. ఎక్కడ.. ఎవరికంటే?
బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ నిర్మాత రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసింది ఎవరికో కాదు హాలీవుడ్ నటి సీడ్ని స్వీనికి.. ఇక విషయం ఏమిటంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కబోతుందట.
By: Madhu Reddy | 17 Sept 2025 5:21 PM ISTమామూలుగా హీరోలకు రెమ్యూనరేషన్ గా రూ.5, రూ.10కోట్ల నుంచి మొదలు రూ.200 కోట్ల వరకు ఉంటుంది. అయితే మన ఇండియన్ సినీ సెలబ్రిటీలలో ప్రత్యేకించి హీరోయిన్లకు రూ. 12 లేదా రూ.15 కోట్లకు మించి రెమ్యూనరేషన్ ఇవ్వరు. అయితే హాలీవుడ్ లో మాత్రం ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్స్ రూ.45 నుండి రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటికి మాత్రం ఏకంగా రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారట.. 530 కోట్ల రెమ్యూనరేషన్ అంటే అంతా తూచ్.. అంతా రుమరే అని కొంతమంది ఈ వార్తలను కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఒక నటికి 530 కోట్ల ఆఫర్ ఇచ్చారని అంతర్జాతీయ మీడియా తెలుపుతోంది. మరి ఆ నటి ఎవరు..? రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఆమెలో ఉన్న స్పెషాలిటీ ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ నిర్మాత రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసింది ఎవరికో కాదు హాలీవుడ్ నటి సీడ్ని స్వీనికి.. ఇక విషయం ఏమిటంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కబోతుందట. అయితే ఆ సినిమా కోసం హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి సిడ్నీ స్వీనినీతీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సిడ్ని స్వీని ఈ సినిమాలో నటించడం కోసం భారీ రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేశారట. ఏకంగా 45 మిలియన్ పౌండ్లు అంటే 530 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందంలో 35 మిలియన్ పౌండ్లు అంటే 415 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు 10 మిలియన్ పౌండ్లు అంటే 115 కోట్ల స్పాన్సర్షిప్ ఒప్పందాలు ఉన్నట్టు తెలుస్తోంది..
అయితే అంత భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇచ్చి హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనిని తీసుకోవడానికి కారణం ఏంటంటే.. సిడ్నీ స్వీని ఆ సినిమాలో నటిస్తే ఆమె పాపులారిటీ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో సినిమాకి మంచి హైప్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇక బాలీవుడ్ నిర్మాత తీయబోయే ఆ స్టోరీలో సిడ్నీ స్వీని ఒక యువ అమెరికన్ నటి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. అలాగే సిడ్నీ స్వీని ఓ భారతీయ సెలబ్రిటీతో ఈ సినిమాలో ప్రేమలో పడటాన్ని చూపిస్తారట.
అలాగే ఈ మూవీ వచ్చే ఏడాది అనగా 2026 ప్రారంభంలో ప్యారిస్, న్యూయార్క్,లండన్, దుబాయ్ వంటి అనేక ప్రదేశాలలో షూటింగ్ చేయబోతున్నట్టు సమాచారం.. అయితే సిడ్నీ స్వీనికి అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని ముందుకు వస్తే మొదట ఆమె నమ్మలేదట.. కానీ ఈ ప్రాజెక్టు చాలా ఆసక్తికరంగా ఉండడంతో తన రేంజ్ మరింత పెరుగుతుంది అనే ఉద్దేశంతో బాలీవుడ్ మూవీ లో నటించడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..
ఇక ఈ సినిమాలో సిడ్నీ స్వీని నటిస్తే ఆ సినిమా రేంజ్ అంతర్జాతీయంగా హైప్ తెచ్చుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడ కూడా బయట పడకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.. ఇక హాలీవుడ్ నటి స్విడ్ని స్వినీ గురించి చూస్తే.. సిడ్నీ డ్రామా యుఫోరియా అలాగే బ్లాక్ కామెడీ ది వైట్ లోటస్ లోని టీవీ పాత్రల ద్వారా ఫేమస్ అయ్యింది..
