Begin typing your search above and press return to search.

స్వయంభు: రెండేళ్ల కష్టం.. 170 రోజుల యుద్ధం

ఒక సినిమా కోసం హీరోలు కష్టపడటం సహజం. కానీ ఆ సినిమానే లోకంగా, ఆ పాత్రే ప్రాణంగా రెండేళ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు.

By:  M Prashanth   |   24 Nov 2025 11:55 AM IST
స్వయంభు: రెండేళ్ల కష్టం.. 170 రోజుల యుద్ధం
X

ఒక సినిమా కోసం హీరోలు కష్టపడటం సహజం. కానీ ఆ సినిమానే లోకంగా, ఆ పాత్రే ప్రాణంగా రెండేళ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, ఇప్పుడు సడెన్ గా ఒక వీడియో వదిలి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ విజువల్స్, ఆ గ్రాండియర్ చూస్తుంటే.. అతని సినిమానేనా, లేక హాలీవుడ్ రేంజ్ అవుట్ పుట్టా అనే అనుమానం రాకమానదు.

కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొడతాయి, కానీ కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక హిస్టారికల్ వండరాన్ని సృష్టించే పనిలో పడ్డారు ఆ మేకర్స్. వేల మంది ఆర్టిస్టులు, భారీ సెట్టింగులు, కనీవినీ ఎరుగని యుద్ధ సన్నివేశాలు.. ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ప్లానింగే జరిగినట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ఆ కష్టానికి ఎండ్ కార్డ్ పడింది.

అవును.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'స్వయంభు' గురించే ఈ చర్చ. లేటెస్ట్ గా రైజ్ ఆఫ్ స్వయంభు అంటూ వీడియో రిలీజ్ చేశారు. అందులో నిఖిల్ పర్ఫెక్ట్ మేకింగ్ గురించి వివరించారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం నిఖిల్ ఎన్నడూ లేనంతగా కష్టపడ్డాడు అనే చెప్పాలి. సుమారు 170 రోజుల పాటు జరిగిన షూటింగ్ లో నిఖిల్ పడిన కష్టం ఇప్పుడు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ఘనంగా ప్రకటించింది.

మన చరిత్ర, సంస్కృతి, ఆచారాలకు అద్దం పట్టే కథ ఇది. పుస్తకాల్లో దొరకని ఒక గొప్ప వీరుడి గాధను వెండితెరపై ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ విజువల్ వండర్ ను 2026 ఫిబ్రవరి 13న, మహాశివరాత్రి పర్వదినాన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. భువన్, శ్రీకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం కావడం విశేషం.

ఈ బీటీఎస్ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరి కష్టాన్ని నిఖిల్ ఈ వీడియోలో ఎలివేట్ చేశాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ గ్రాండియర్ కనిపిస్తోంది. ముఖ్యంగా కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాలు కానున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద మరోసారి మన చరిత్ర ఘనతను చాటిచెప్పేలా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు.

'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 'స్వయంభు'తో ఆ రేంజ్ ను పీక్స్ కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగనున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా మెప్పించేలా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది. మరి ఈ 'స్వయంభు' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో చూడాలి.