Begin typing your search above and press return to search.

మాజీ భార్య‌కు 400 కోట్లు భ‌ర‌ణం ఇచ్చిన స్టార్ హీరో? ఇదిగో ఫైన‌ల్ క్లారిటీ!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ త‌న‌ మాజీ భార్య సుసానే ఖాన్ ల విడాకుల ఉదంతం దేశంలోనే అత్యధికంగా చర్చించుకున్న సెలబ్రిటీ బ్రేకప్స్ ల‌లో ఒకటి.

By:  Sivaji Kontham   |   3 July 2026 7:00 PM IST
మాజీ భార్య‌కు 400 కోట్లు భ‌ర‌ణం ఇచ్చిన స్టార్ హీరో? ఇదిగో ఫైన‌ల్ క్లారిటీ!
X

ఒక సెలబ్రిటీ జంట విడిపోతున్నప్పుడు వారి వ్యక్తిగత విషయాలపై.. ముఖ్యంగా `భరణం` విషయంలో మీడియా - సోషల్ మీడియాలో వచ్చే ఆధారాలు లేని పుకార్లు సదరు మహిళల ప్రతిష్టను ఎలా దెబ్బతీస్తున్నాయి? గోల్డ్ డిగ్గ‌ర్ (డ‌బ్బు విలువైన‌వి గుంజుకునే వ్య‌క్తి) అంటూ కామెంట్లు చేస్తుంటే.... ఇలాంటి సున్నితమైన విషయాల్లో బాధితులు మౌనంగా ఉండటం సరైనదేనా? లేక వెంటనే స్పందించి ఖండించాలా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుసానే ఖాన సోద‌రి స‌మాధాన‌మిచ్చారు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ త‌న‌ మాజీ భార్య సుసానే ఖాన్ ల విడాకుల ఉదంతం దేశంలోనే అత్యధికంగా చర్చించుకున్న సెలబ్రిటీ బ్రేకప్స్ ల‌లో ఒకటి. 2014లో వీరు విడిపోయిన సమయంలో సుసానే త‌న భ‌ర్త‌ హృతిక్ నుండి రూ. 400 కోట్ల భారీ మొత్తాన్ని భరణంగా డిమాండ్ చేసి తీసుకుందనే వార్తలు విపరీతంగా ప్రచారమయ్యాయి. అయితే తాజాగా ఈ పుకార్లపై సుసానే ఖాన్ సోదరి, ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ స్పందిస్తూ అవన్నీ కేవలం అబద్ధాలని.. ఆధారం లేని పుకార్లని కొట్టిపారేశారు.

ఒక ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ అలీ మాట్లాడుతూ.. ``ఆన్‌లైన్‌లో రూ. 400 కోట్లు చెల్లించారని.. సుసానే ధనవంతురాలైపోయిందని వస్తున్న కామెంట్లు చూస్తుంటే నా మనసు కలిచివేస్తోంది... అదంతా పచ్చి అబద్ధం`` అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లి తమకు బంధాలకే విలువ ఇవ్వాలని నేర్పిందని... భౌతిక సుఖాలకు కాదని స్పష్టం చేశారు. తన సోదరి హృతిక్ నుండి ఎలాంటి డబ్బు లేదా ఆస్తి తీసుకోలేదని... ఒక ప్రతిష్టాత్మకమైన ఖాందానీ కుటుంబం నుండి వచ్చిందని.. త‌ను డబ్బు ఆశించే వ్యక్తి (గోల్డ్ డిగ్గ‌ర్) కాదని ఫరా ఖాన్ గట్టిగా సమర్థించారు.

విడాకులు పూర్తయిన తర్వాత ఈ 400 కోట్ల పుకార్లు వస్తున్నప్పుడు.. వాటిని బహిరంగంగా ఖండించమని తాను సుసానేకు ఎన్నోసార్లు సలహా ఇచ్చానని ఫరా గుర్తుచేసుకున్నారు. కానీ సుసానే దానికి నిరాకరిస్తూ..``ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం...వారి అభిప్రాయాలు నా జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురావు`` అంటూ మౌనాన్ని ఆశ్రయించిందని చెప్పారు. మీడియా కోసం తమ వైవాహిక జీవితాన్ని రచ్చకెక్కిండం సుసానేకు ఇష్టం లేకపోవడం వల్లే అప్పట్లో స్పందించలేదని ఫరా తెలిపారు.

డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా సుసానే హుందాగా ప్రవర్తించడం వల్లే... నేటికీ హృతిక్ రోషన్ కుటుంబంతో త‌న‌కు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని ఫరా తెలిపారు. హృతిక్ తల్లిదండ్రులు పింకీ, రాకేష్ రోషన్ లు ఇప్పటికీ సుసానేను ఎంతో ప్రేమిస్తారని చెప్పారు. హృతిక్ - సుసానే చిన్ననాటి స్నేహితులు.. 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్న ఈ జంటకు హృహాన్, హృదాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2013లో విడిపోతున్నట్లు ప్రకటించి 2014లో అధికారికంగా విడాకులు తీసుకున్నా పిల్లల పెంపకం .. ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం వీరు ఇప్పటికీ ఒక మంచి స్నేహితులుగా కలిసి మెలుగుతున్నారు.

సెలబ్రిటీల జీవితాల్లో విడాకులు అనేవి ఒక బాధాకరమైన ఘట్టం కాగా... మీడియా దానికి రూ. 400 కోట్ల భరణం అనే కమర్షియల్ యాంగిల్ జోడించి మరింత వివాదాస్పదం చేసింది. సుసానే సోదరి ఫరా ఖాన్ అలీ చేసిన ఈ ప్రకటనతో దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న‌ నిందలకు, అన‌వ‌స‌ర‌ పుకార్లకు ఎండ్ కార్డ్ పడినట్లయింది. డబ్బు కంటే బంధాలకు, ఆత్మగౌరవానికి విలువ ఇచ్చి... విడిపోయినా పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి స్నేహితులుగా కొనసాగుతున్న హృతిక్- సుసానేల ప్రవర్తన నిజంగానే ప్రశంసనీయం.. నేటి సమాజానికి ఒక ఆదర్శం.