Begin typing your search above and press return to search.

ప‌డిపోయిన హీరోల‌ను పైకి లేపిన కంటెంట్!

ఎంత‌టి వారినైనా స‌క్సెస్ ఒక్క‌టే ఇండ‌స్ట్రీలో నిల‌బెడుతుంది. `విరూపాక్ష`కి ముందు వ‌ర‌కూ మెగా మేన‌ల్లుడు సాయితేజ్ న‌టించిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.

By:  Srikanth Kontham   |   30 Dec 2025 4:00 AM IST
ప‌డిపోయిన హీరోల‌ను పైకి లేపిన కంటెంట్!
X

ఎంత‌టి వారినైనా స‌క్సెస్ ఒక్క‌టే ఇండ‌స్ట్రీలో నిల‌బెడుతుంది. `విరూపాక్ష`కి ముందు వ‌ర‌కూ మెగా మేన‌ల్లుడు సాయితేజ్ న‌టించిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ 16 సినిమాల్లో న‌టించాడు. `పిల్లా నువ్వులేని జీవితం`, `సుబ్ర‌మ‌ణ్యం ఫర్ సేల్`, `చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తీ రోజు పండ‌గ` మిన‌హా చిత్రాల‌న్నీ ప‌రాజయం చెందిన‌వే. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన `విరూపాక్ష‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆ స‌క్సెస్ అత‌డిని ఏకంగా 100 కోట్ల క్ల‌బ్ లో కూర్చోబెట్టింది. అప్ప‌టికే ప్లాప్ ల్లో ఉన్న సాయితేజ్ లో ఒక్క‌సారిగా ఉత్సాహాన్ని నింపింది.

ఇమేజ్ తో ప‌నిలేకుండా ప్రేక్ష‌కులు అద‌రించిన మ‌రో చిత్రంగా నిలిచింది. అప్ప‌టి నుంచి క‌థ‌ల విష‌యంలో సాయితేజ్ సెల‌క్టివ్ గా ఉంటున్నాడు. ఆ త‌ర్వాత మ‌రో యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా అలా బౌన్స్ అయిన న‌టుడే. `ఎస్. ఆర్ క‌ల్యాణ మండపం` త‌ర్వాత కిర‌ణ్ న‌టించిన సినిమాలు స‌రైన ఫ‌లితాలు సాధించ‌లేదు. వ‌రుస ప్లాప్ చిత్రాల అనంత‌రం `క‌` అనే ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ లో న‌టించాడు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాల‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేసిన చిత్ర‌మిది. బ‌ల‌మైన క‌థ‌కు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోడైదంటే? స‌క్సెస్ ఎలా ఉటుంద‌ని `విరూపాక్ష` త‌ర్వాత ప్రూవ్ చేసిన చిత్ర‌మిది.

కిర‌ణ్ అబ్బ‌వరం కెరీర్ లోనే టాప్ గ్రాస‌ర్ గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విజ‌యంతో వ‌రుస‌గా కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసి ప‌ట్టాలెక్కించాడు. తాజాగా ఆది సాయికుమార్ ని కూడా ఇదే త‌ర‌హా చిత్రం వైఫ‌ల్యాల ఊబిలోని నుంచి బ‌య‌ట‌కు తెచ్చింది. ఆది చాలా కాలంగా స‌క్సెస్ కోసం పోరాటం చేస్తున్నాడు. `ప్రేమ కావాలి`, `ల‌వ్లీ` స‌క్సెస్ త‌ర్వాత ఆది న‌టించిన సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అలాగ‌ని ఖాళీగానూ లేడు. ఏదో సినిమా చేస్తూనే ఉన్నాడు గానీ వాటి గురించి జ‌నాల‌కు తెలియకుండా రిలీజ్ అయిపోయేవి.

తాజాగా `శంబాల` తో చాలా కాలానికి స‌క్సెస్ అందుకున్నాడు. మిస్టిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన సినిమాకు ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. ప్రేక్ష‌కుల‌కు ఓ భిన్నమైన అనుభూతిని పంచిన చిత్రమిది. లాజిక్కుల సంగతి పక్కన పెట్టేస్తే.. వాట్ నెక్స్ట్ అంటూ ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని రేకెత్తించి రెండున్నర గంటలు కూర్చోబెట్టడంలో `శం బాల` విజయవంతమైంది. దీంతో విజ‌యాలు లేక ఇబ్బంది ప‌డుతోన్న ఆదికి ఈ విజ‌యం ఓ బూస్టింగ్ నిలి చింది. సినిమాపై ఆది పెట్టుకున్న న‌మ్మ‌కం నిల‌బ‌డింది. అడ‌విశేష్, విశ్వ‌క్ సేన్ లాంటి న‌టులు కూడా కెరీర్ డౌన్ ఫాలో లో ఉన్న స‌మ‌యంలో? వాళ్ల‌నీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్, క్రైమ్ థ్రిల్ల‌ర్ కాన్సెప్టులే ప్లాప్ ల నుంచి బ‌య‌ట ప‌డేసాయి.