Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ కు న్యూ మిషన్.. సినిమా దాటి సమాజంలోకి మెగా బ్రాండ్

ఇక యువత భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కూడా ఈ కార్యక్రమం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. నేటి యూత్ లో ఉన్న ఎనర్జీ, కనెక్టివిటీ, సోషల్ మీడియా ప్రభావం అన్నీ కలిసి ఇలాంటి సంస్థలకు బలాన్ని చేకూర్చగలవు.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 March 2026 5:05 PM IST
మెగా ఫ్యాన్స్ కు న్యూ మిషన్.. సినిమా దాటి సమాజంలోకి మెగా బ్రాండ్
X

మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల మెగా యూత్ ఫోర్స్ అనే ఫ్యాన్ సంస్థ‌ను ప్రారంభించారు. ఇది కేవలం ఒక ఫ్యాన్ సంస్థగా కాకుండా, మెగా అభిమానుల శక్తిని సమాజ సేవ దిశగా మలిచే కొత్త ప్రయత్నంగా రూపుదిద్దుకోవాల‌ని ఆమె కోరారు. ఈ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మెగా అభిమానులను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో ఫ్యాన్స్ కార్యకలాపాలు ఎక్కువగా మూవీ రిలీజులు, సెలబ్రేషన్ల వరకే పరిమితమయ్యేవి. అయితే ఇప్పుడు అదే శక్తిని సమాజానికి ఉపయోగపడే విధంగా మలచాలనే దిశగా ఈ సంస్థ ముందుకు రావడం ప్రత్యేకతనే చెప్పాలి. ఫ్యాన్స్ పవర్ ను సోషియల్ పవర్ గా మార్చే ప్రయత్నం ఇదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక యువత భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కూడా ఈ కార్యక్రమం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. నేటి యూత్ లో ఉన్న ఎనర్జీ, కనెక్టివిటీ, సోషల్ మీడియా ప్రభావం అన్నీ కలిసి ఇలాంటి సంస్థలకు బలాన్ని చేకూర్చగలవు. ముఖ్యంగా విద్యార్థులు, యువ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఇందులో భాగస్వాములు కావొచ్చని అంచనాలు ఉన్నాయి. సామాజిక ప్రభావం దృష్ట్యా, మెగా యూత్ ఫోర్స్ ఫ్యూచ‌ర్ లో చేపట్టే కార్యక్రమాలపై ఆసక్తి నెలకొంది.

బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్, ఛారిటీ కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య శిబిరాలు వంటి విభిన్న సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలు సక్రమంగా అమలు అయితే, ఇది కేవలం ఫ్యాన్ బేస్‌కే కాకుండా సమాజానికే ఉపయోగపడే శక్తిగా మారుతుంది. ఇదే సమయంలో మెగా బ్రాండ్ విస్తరణకు కూడా ఇది ఒక కొత్త దిశగా మారుతోంది. సినిమా పరిమితులను దాటి, సామాజిక రంగంలో కూడా మెగా ఫ్యామిలీ ప్రభావాన్ని పెంచే ప్రయత్నంగా దీనిని చూడవచ్చు. ఫ్యాన్స్ లో ఉన్న ఎమోష‌న‌ల్ బాండింగ్ ను సేవా కార్యక్రమాలుగా మార్చడం ద్వారా బ్రాండ్ ఇమేజ్ మరింత బలపడే అవకాశం ఉంది.

కాగా ఈ సంస్థ‌కు రాజమండ్రికి చెందిన బాబీ ఏడిద‌ను జాతీయ కన్వీనర్‌గా సుస్మిత నియ‌మిస్తూ నోట్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ తమ మద్దతు వ్యక్తం చేస్తున్నారు. కొత్త దిశలో ముందుకు వెళ్తున్న ఈ ప్రయత్నం పట్ల ఉత్సాహం బాగా కనిపిస్తోంది. చూస్తుంటే, ఇలాంటి ఫ్యాన్ బేస్డ్ సంస్థలు భవిష్యత్తులో పెద్ద సామాజిక శక్తులుగా మారే అవకాశాలు లేక‌పోలేదు. సరైన మార్గదర్శకం, పారదర్శకత, నిరంతర కార్యకలాపాలుంటే, ఇవి యూత్‌ను సమాజానికి దగ్గర చేసే వేదికలుగా నిలుస్తాయి. అదే సమయంలో, ఈ శక్తి సానుకూల దిశలోనే కొనసాగడం కీలకం. మెగా యూత్‌ఫోర్స్ ఆ దిశగా ఎంతవరకు ముందుకు సాగుతుంద‌నేది చూడాల్సిన అంశంగా మారింది.