Begin typing your search above and press return to search.

'సితార' నాగవంశీ.. మామూలు బిజీగా లేరుగా!

అయితే ప్రముఖ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణకు తొలినాళ్లలో తెర వెనుక సాయం అందించిన నాగవంశీ.. ఎక్కడా పెద్దగా కనిపించేవారు కాదు.

By:  M Prashanth   |   10 Aug 2025 11:51 AM IST
సితార నాగవంశీ.. మామూలు బిజీగా లేరుగా!
X

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరన్న విషయం తెలిసిందే. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఫుల్ గా పాపులర్ అయిపోయారు. ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించిన వార్తలు, ఇంటర్వ్యూ వీడియోస్ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతుంటాయి.

అయితే ప్రముఖ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణకు తొలినాళ్లలో తెర వెనుక సాయం అందించిన నాగవంశీ.. ఎక్కడా పెద్దగా కనిపించేవారు కాదు. ఆ సమయంలో తక్కువ ప్రొఫైల్ ను మెయింటైన్ చేసేవారు. కానీ ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేతగా టాక్ ఆఫ్ టాన్ గా నిలిచారు.

మిడ్ రేంజ్ సినిమాలతో బ్యానర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు బడా చిత్రాలను కూడా రూపొందిస్తున్నారు. వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. అదే సమయంలో డిస్ట్రిబ్యూషన్ లో తన సత్తా చాటుతున్నారు. మంచి విజయాలు అందుకుంటున్నారు. ఇప్పుడు యమా బిజీగా గడుపుతున్నారు.

క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా నాగవంశీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తుంది. కొన్ని నెలలుగా అయితే నాగవంశీ మామూలుగా బిజీగా లేరని చెప్పాలి. మరికొన్ని నెలలు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇటీవల ఆయన కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కొన్ని నెలలపాటు ఆ సినిమా షూటింగ్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టారు. రీసెంట్ గా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు వార్-2 మూవీతో సందడి చేయనున్నారు. ఆ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నాగవంశీ.. ఇప్పుడు ఆగస్టు 14వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

అయితే భారీ పెట్టుబడితో ఆ సినిమా హక్కులు తీసుకున్న ఆయన.. ఇప్పుడు ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వార్-2 అయ్యాక కూడా నాగవంశీ ఫ్రీ అవ్వలేరు. ఎందుకంటే ఆయన లైనప్ లో అనేక భారీ సినిమాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా స్టార్ట్ చేయనున్నారు. మొత్తానికి నాగవంశీ మాత్రం.. ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉన్నారనే చెప్పాలి.