ఇక్కడ జరిగేది ప్రపంచంలో ఎవ్వరూ కనుక్కోలేరా?
ఈ నేపథ్యంలో ఓ మీడియాకు నిర్మాత నాగవంశీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తూ ఇండస్ట్రీలో జరిగే రూమర్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Entertainment Desk | 4 Jan 2026 6:00 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. అంతే కాకుండా ఓ హీరోకు, ప్రొడ్యూసర్‌కు పడటం లేదని, ఇద్దరి మధ్య ప్రఛ్చన్న యుద్ధం మొదలైందని, ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇద్దరు కలిసి చేసిన సినిమా ఫ్లాప్ కావడమేనని వార్తలు షికారు చేస్తుంటాయి.అయితే ఆ వార్తల్లో అసలు నిజమే ఉండదని, అవన్నీ వట్టి పుకార్లని చెబుతున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లని నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజాతోచేసిన `మాస్ జాతర` ఫలితం తేడా కొట్టేయడంతో ప్రస్తుతం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అఖిల్ అక్కినేనితో `లెనిన్` మూవీని కింగ్ నాగార్జునతో కలిసి నిర్మిస్తున్న నాగవంశీ .. మాస్‌కా దాస్ విశ్వక్‌సేన్‌తో `ఫంకీ`, అల్లరి నరేష్‌తో `ఆల్కహాల్`, నవీన్ పొలిశెట్టితో `అనగనగ ఒక రాజు` వంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. ఇందులో నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా రూపొందుతున్న `అనగనగ ఒక రాజు` ఈ సంక్రాంతి బరిలో దిగుతోంది.
ఈ నేపథ్యంలో ఓ మీడియాకు నిర్మాత నాగవంశీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తూ ఇండస్ట్రీలో జరిగే రూమర్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఒకరితో సినిమా చేసి అది ఫ్లాప్ అయితే మళ్లీ వాళ్లతో కలిసి సాగడానికి ఇబ్బంది ఏమైనా ఉంటుందా? అనే ప్రశ్నకి నాగవంశీ ఆసక్తికరంగా స్పందించారు. జర్నీ ఎలా ఉంటే దాన్ని బట్టే మళ్లీ కలవడం అనేది ఉంటుంది. సినిమా రిజల్ట్‌తో ఎప్పుడూ సంబంధం ఉండదు.
జర్నీ స్మూత్‌గా ఉంటే సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా కలుస్తాం. అయితే జర్నీనే స్మూత్‌గా లేకపోతే సినిమా హిట్టయినా సరే మళ్లీ కలవం`అన్నారు. మరి జనాలు వేరేలా అనుకుంటారని, నాగవంశీకి, హీరోకు మధ్య చెడింది కాబట్టే కలవడం లేదనే టాక్ నడుస్తుంటుంది కదా అని అడిగే .. ఆసక్తికరంగా స్పందించారు. `విషయం ఏంటంటే వెబ్ సైట్లలో గానీ న్యూస్ ఛానల్స్‌లలో గానీ రోజుకు పది నుంచి పదిహేనే వరకు సినిమా ఇండస్ట్రీ గురించి న్యూస్‌లు వచ్చాయనుకోండీ అందులో 14 రూమర్స్, గాసిప్స్.. ఒకటి మాత్రమే నిజం ఉంటుంది.
ఇండస్ట్రీలో జరిగేది ఏదీ బయట తెలియదు. ఎవ్వరికీ తెలియదు. ఒక ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి గానీ, ఒక డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి గానీ ఒక హీరోకి డైరెక్టర్‌కి గానీ, ఒక హీరో.. ప్రొడ్యూసర్‌కి గానీ.. వీళ్ల మధ్యలో ఏం జరుగుతోంది? ఏంటీ అనేది ప్రపంచంలో ఎవ్వరూ కనుక్కోలేరు?. బయటికి చెప్పాలంటే..దాన్ని బయటికి ఇవ్వాలని ఉంటే ఇవ్వడం తప్పితే ప్రపంచంలో ఎవ్వరూ కనుక్కోలేరు? ..ఎవ్వరూ బయటికి నిజాలు చెప్పరు. ఇక్కడ ప్రతీదీ మేనేజ్ చేసేస్తుంటారు. బుక్‌మై షో రేటింగ్, యూట్యూబ్ వ్యూస్, కలెక్షన్స్ ఇలా ప్రతీదీ మేనేజ్ చేసేస్తున్నారు. దీంతో ఇక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు` అంటూ అసలు విషయం బయటపెట్టారు.
