ఆ స్టార్ హీరో ముంబై ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్!
బోనులో సింహాన్ని బయటకు వదిలితే ?వేట ఎలా ఉంటుంది? అన్నది `సింగం` ప్రాంచైంజీలో చూపిం చాడు సూర్య.
By: Srikanth Kontham | 25 Aug 2025 6:35 PM ISTబోనులో సింహాన్ని బయటకు వదిలితే ?వేట ఎలా ఉంటుంది? అన్నది `సింగం` ప్రాంచైంజీలో చూపిం చాడు సూర్య. కటౌట్ కు తగ్గ కంటెంట్ ని సిద్దం చేసి హరి వదిలిన సింహమది. `సింగం` ప్రాంచైజీని ఆసక్తిర కథ, కథనాలతో ఒకటే పరుగులు పెట్టించాడు. మూడవ భాగంతో ఏకంగా యూనివర్శల్ కాప్ ని చేసాడు. మండల పీఎస్ స్థాయిలో మొదలైన కథని ఏకంగా అంతర్జాతీయ స్థాయికి కనెక్ట్ చేసాడు. దీంతో `సింగం -4`పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇద్దరి కాంబినేషన్ లో ఫోర్త్ ఇన్ స్టాల్ మెంటు ఎప్పుడు? అంటూ నెట్టింట అభిమానులు అడుగుతూనే ఉంటారు.
షాక్ ఇచ్చిన నయా మేకర్:
అందుకు ఇంకా సమయం ఉందంటూ సూర్య-హరి లు స్కిప్ కొడుతున్నారు. అయితే ఇప్పుడా సింగం కంటే రియల్ సింగం కథతో బరిలోకి దిగడానికి సూర్య సిద్దమవుతున్నాడు? అన్నది తాజాగా అందుతోన్న సమాచారం. సూర్య 47వ చిత్రం మాలీవుడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ తో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇది పోలీస్ కథగా ప్రకటించారు. ఇందులో సూర్య శక్తివంత మైన పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు. కానీ సూర్య పోషించేది పోలీస్ పాత్ర మాత్రమే కాదు...ఏకంగా ముంబై మాఫియానే గడ గడలాడించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవిత కథలో ఓ భాగమని అని తాజాగా కోలీవుడ్ లో మీడియాలో ప్రచారం మొదలైంది.
రియల్ పోలీస్ స్టోరీ:
దయా నాయక్ గురించి పరిచయం అవసరం లేదు. ముంబై మాపియా గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన పవర్ పుల్ పోలీస్. మాఫియాని కూకిట వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేసారు దయా నాయక్. కరుడ గట్టిన గ్యాంగ్ స్టర్లను గురి తప్పకుండా ఎన్ కౌంటర్ తో పార్శిల్ చేసాడు. 1980-90వ దశకంలో మాఫియా పాలిట సింహ స్వప్నంగా పేరు గాంచారు. సాధారణ ఎస్ ఐగా మొదలైన దయానాయక్ గ్యాంగస్టర్లను లేపేయడంలో? స్పెషలిస్ట్ గా ఎదిగారు. సరిగ్గా ఈ పదేళ్ల కథను, దయానాయక్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అంశాన్నే జీతూ మాధవన్ కథా వస్తువుగా తీసుకున్నట్లు ఓ వార్త తెరపైకి వచ్చింది.
పదేళ్ల కథేనా?
మరి ఈ ప్రచారంలో నిజమేంటో తెలియాలి. గతంలో దయా నాయక్ జీవితం స్పూర్తితోనే `అబ్ తప్ చక్క న్` అనే చిత్రం తెరకెక్కింది. ఇది 2004లో రిలీజ్ అయింది. ఆ తర్వాత దయానాయక్ పూర్తి జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కథనాలు తప్ప ఇంత వరకూ సాధ్యపడలేదు. తాజాగా సూర్య 47వ సినిమా కూడా దయా నాయక్ లో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కోణాన్నే తీసుకుంటున్నారు? అన్నది తాజా ప్రచారం. మేకర్స్ దృవీకరిస్తే గానీ క్లారిటీ రాదు.
