మహేష్ డైలాగ్ తో అదరగొట్టేసిన విజయ్ సేతుపతి కొడుకు.. దింపేశాడు భయ్యా!
విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి నటిస్తున్న ఫీనిక్స్ మూవీకి స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు.
By: Madhu Reddy | 10 Aug 2025 12:46 PM ISTవిజయ్ సేతుపతి.. విభిన్న పాత్రలు పోషిస్తూ మల్టీ టాలెంట్ ఉన్న నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన కేవలం తమిళంలోనే కాదు తెలుగు, హిందీ సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా హీరోగానే కాదు విలన్ గా కూడా సత్తా చాటారు. అలా 'ఉప్పెన' సినిమాలో తన విలనిజానికి చాలామంది ఫిదా అయ్యారు. అయితే అలాంటి విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి మొదటిసారి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవబోతున్నారు. ఫీనిక్స్ అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సూర్య సేతుపతి సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్ లో తనకి మహేష్ బాబు మీద ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు సూర్య సేతుపతి. ఈవెంట్ కి హోస్ట్ గా చేసిన యాంకర్ మీకు ఇష్టమైన హీరో ఎవరు ? అని అడగగా.. మహేష్ బాబుకి నేను పెద్ద వీరాభిమానిని అని చెప్పారు. మరి మహేష్ బాబు తెలుగు డైలాగ్ ఏదైనా ఒకటి చెబుతారా అని యాంకర్ అడుగుతూ..పోకిరి మూవీ డైలాగ్ ని చెప్పించింది. అలా "ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. వాడే పండుగాడు.. నేనే పండు".. అంటూ డైలాగ్ ని సూర్య సేతుపతితో చెప్పించింది. ఇక ఈ డైలాగ్ ని చెప్పిన సూర్య ఆ తర్వాత హ్యాపీ బర్త్డే మహేష్ బాబు సార్ అంటూ సూపర్ స్టార్ పై తనకి ఉన్న ఇష్టాన్ని ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో బయట పెట్టారు. ప్రస్తుతం సూర్య సేతుపతి చెప్పిన మహేష్ బాబు పోకిరి మూవీ డైలాగ్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొంతమంది విజయ్ సేతుపతి అభిమానులు మహేష్ బాబు డైలాగ్ ని దింపేశాడు భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి నటిస్తున్న ఫీనిక్స్ మూవీకి స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతోమంది పెద్ద హీరోల సినిమాలకు స్టంట్ మాస్టర్ గా చేసిన అనల్ అరసు ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవబోతున్నారు. ఈ మూవీలో వర్ష అనే అమ్మాయిని హీరొయిన్ గా పెట్టారు. వర్షకి కూడా ఇది హీరోయిన్ గా మొదటి సినిమానే. అందరు కొత్త వాళ్ళతో వస్తున్న ఈ ఫీనిక్స్ మూవీ టీజర్ ని విడుదల చేశారు.అయితే తమిళంలో వస్తున్న ఫీనిక్స్ మూవీ కేవలం తమిళ భాషలోనే కాదు తెలుగులో కూడా తీసుకురాబోతున్నారట.
తెలుగులోకి ధనుంజయన్ తీసుకొస్తున్నారని, ఆయనకు సూర్య సేతుపతి స్పెషల్ థాంక్యూ అంటూ తెలిపారు. అలాగే అనల్ అరసు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సినిమాతో హిట్ కొడతాను అంటూ సూర్య సేతుపతి చెప్పుకొచ్చారు. అనల్ అరసు ఈవెంట్ లో మాట్లాడుతూ.. సూర్య చాలా హార్డ్ వర్కర్ అని, ఏ సీన్ అయినా సరే చాలా పర్ఫెక్ట్ గా చేస్తారంటూ చెప్పుకొచ్చారు. యాక్షన్, అద్భుతమైన ఎమోషన్ తో కూడిన ఫీనిక్స్ మూవీ జూలై 4న తెలుగులో విడుదల కాబోతుంది.
