Begin typing your search above and press return to search.

సూర్యా.. సక్సెస్ లేని టైమ్ లో రిస్కీ క్లాష్?

సూర్యా అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తయినప్పటికీ, నాన్ థియేట్రికల్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదనే కారణంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు.

By:  M Prashanth   |   19 Aug 2025 7:00 AM IST
సూర్యా.. సక్సెస్ లేని టైమ్ లో రిస్కీ క్లాష్?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యా తన తదుపరి థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరు ‘కరుప్పు’. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సూర్యా కెరీర్‌లో ఒక విభిన్న యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మొదట దీపావళి రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు పొంగల్ 2026 రిలీజ్ ప్లాన్ కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు.

సూర్యా అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తయినప్పటికీ, నాన్ థియేట్రికల్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదనే కారణంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. టీజర్ మాత్రం విడుదలైంది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినా, సినిమా బజ్ మాత్రం అంచనాలకు తగ్గట్టు పెరగలేదు. సూర్యా గతంలో ఎదుర్కొన్న కొన్ని వైఫల్యాల కారణంగా ‘కరుప్పు క్రేజ్ తక్కువగా ఉందన్నది ఇండస్ట్రీ టాక్.

పొంగల్ రిలీజ్ రిస్క్

కరుప్పు పొంగల్ 2026కి వస్తే, ఇది నిజంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే అదే సమయంలో విజయ్ నటిస్తున్న ‘జన నాయకన్’ సినిమా రిలీజ్ అవుతోంది. శివకార్తికేయన్ ‘పరాశక్తి’ కూడా అదే సీజన్‌కి వస్తోంది. ఈ రెండు సినిమాలకు ఉన్న అంచనాలు, మార్కెట్, స్క్రీన్లు సూర్యా సినిమాను బలహీనంగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్యా సినిమా స్క్రీన్ కౌంట్ తగ్గిపోవడం ఖాయం.

తెలుగు మార్కెట్ పరిస్థితి

కరుప్పు తెలుగు వెర్షన్ విషయానికి వస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే పొంగల్ 2026లో ఇప్పటికే పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా, నావీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. వీటికి తోడు జన నాయకన్, పరాశక్తి డబ్ వెర్షన్లు కూడా వస్తాయి. ఈ పరిస్థితుల్లో కరుప్పు తెలుగు వెర్షన్‌కు పెద్ద స్థాయి స్క్రీన్లు దొరకడం కష్టం.

దీపావళి సేఫ్ బెట్

ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం కరుప్పు దీపావళికి రిలీజ్ అయితే మంచి థియేట్రికల్ కౌంట్ దక్కుతుంది. తమిళంలోనూ, తెలుగులోనూ ఇది ఆడియన్స్‌కు ప్రథమ ఎంపికగా మారే అవకాశం ఉంది. ఫెస్టివల్ హాలిడే సీజన్‌లో కరుప్పు లాంటి మాస్ యాక్షన్ డ్రామా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తం మీద, కరుప్పు విడుదలపై క్లారిటీ త్వరలో రానుంది. పొంగల్ 2026 క్లాష్ అంటే సూర్యాకు రిస్క్ తప్పదు. కానీ దీపావళి రిలీజ్ అయితే మాస్ రెస్పాన్స్‌తో పాటు మంచి స్క్రీన్ కౌంట్ కూడా దక్కే అవకాశం ఉంది. ఫైనల్ గా సూర్యా, ఆర్జే బాలాజీ టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.