సూర్య నష్టాలకు.. ఆ హీరో బలవుతున్నాడా..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తీసిన కంగువ, రెట్రో రెండు సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి. కంగువ సినిమా స్తూడియో గ్రీన్ బ్యానర్ లో కె.యి జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో నిర్మించారు
By: Ramesh Boddu | 26 Oct 2025 8:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య తీసిన కంగువ, రెట్రో రెండు సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి. కంగువ సినిమా స్తూడియో గ్రీన్ బ్యానర్ లో కె.యి జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. శివ డైరెక్షన్ లో తెరకెక్కిన కంగువ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఐతే ఆ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ తో రెట్రో అంటూ అటెంప్ట్ చేశాడు సూర్య. అది కూడా ఎందుకో మిస్ ఫైర్ అయ్యింది. కార్తీక్ సుబ్బరాజు సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నా సూర్య రెట్రో తో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు కార్తీక్.
సూర్య ఆర్జే బాలాజీతో కరుప్పు..
ప్రస్తుతం సూర్య ఆర్జే బాలీజితో కరుప్పు చేశాడు. అది నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ రిలీజ్ అవుతుంది. మరోపక్క సూర్య తన కొత్త ప్రొడక్షన్ అగరం తో పాటు జ్ఞానవేల్ తో కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కంగువ డైరెక్టర్ శివ డైరెక్ట్ చేస్తున్నారట. సినిమాలో హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నారని తెలుస్తుంది. విజయ్ సేతుపతి తో సినిమా అంటే కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది అని ఫిక్స్ అవ్వొచ్చు.
ఐతే విజయ్ సేతుపతి స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. కానీ ఇప్పటికే ఆయన పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారు. పూరీ గొప్ప దర్శకుడే కానీ ఇప్పుడు ఆయన అసలేమాత్రం ఫాం లో లేడు. ఆ సినిమా పరిస్థితి ఏంటో అనుకుంటుంటే ఇప్పుడు కంగువ శివ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఈమధ్యనే తలైవన్ తలైవి సినిమాతో సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతి పూరీతో స్లం డాగ్.. శివ తో నెక్స్ట్ సినిమా చేసి హిట్ కొడితే అప్పుడు నిజంగానే విజయ్ సేతుపతి మాస్ స్టామినా ప్రూవ్ అయినట్టు అవుతుంది.
విజయ్ సేతుపతితో సూర్య సినిమా..
విజయ్ సేతుపతితో సూర్య సినిమా అనేసరికి సూర్య లాస్ లకు విజయ్ సేతుపతి బలవడం ఏంటంటూ ఆడియన్స్ అంటున్నారు. విజయ్ సేతుపతికి ఎలాగు స్టోరీ సెలక్షన్ మీద మంచి గ్రిప్ ఉంది కాబట్టి నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఆలోచిస్తే కచ్చితంగా సూర్య, విజయ్ సేతుపతి కాంబో మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి శివ, సూర్య, విజయ్ సేతుపతి, జ్ఞానవేల్ రాజా ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.
సూర్య సినిమాల విషయానికి వస్తే కరుప్పు తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది.
