జిమ్ కంటే వంటింట్లోనే అసలు రహస్యం!
ఆరోగ్యం - ఫిట్‌నెస్ అనగానే మొదట గుర్తొచ్చేది గంటల తరబడి జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు క్రమ పద్దతిలో తినడం. ఈ రెండు చేస్తే చాలు బరువు సునాయాసంగా తగ్గుతామని అందరు చెప్పే మాట.
By: Srikanth Kontham | 12 May 2026 8:00 PM ISTఆరోగ్యం - ఫిట్‌నెస్ అనగానే మొదట గుర్తొచ్చేది గంటల తరబడి జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు క్రమ పద్దతిలో తినడం. ఈ రెండు చేస్తే చాలు బరువు సునాయాసంగా తగ్గుతామని అందరు చెప్పే మాట. ఇదే అంశంపై చాలా మంది సెలబ్రిటీలు తమ అనుభవాలు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు ఎలాంటి పుడీ అన్నది తెలిసిందే. ముక్క లేనిదే ముద్ద దిగనంతగా ఉండేవారు. కానీ ఆ తర్వాత అతడి శరీరంలో వచ్చిన మార్పకు అంతా స్టన్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో మరింత సన్నని రివటలా మారిపోయారు.
మరి తారక్ ఇలా ఎందుకు మారాడు? అంటే పూర్తిగా డైట్ కంట్రోలింగ్ తోనే అన్నది కాదనలేని నిజం. నోరును అదుపులో పెట్టుకుంటే బరవు తదానంతట అదే తగ్గిపోతందుని..అందుకోసం కఠినమైన వ్యాయామాలు కూడా చేయాల్సిన పని లేదన్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య కూడా తారక్ నియమానికి సమీపంగానే చెప్పుకొచ్చారు. ఫిట్‌నెస్ విషయంలో శరీరానికి శ్రమ ఇవ్వడం కంటే? తీసుకునే ఆహారంపై నియంత్రణ కలిగి ఉండటమే అత్యంత ముఖ్యమని సూర్య అభిప్రాయపడ్డారు. `శరీరం జిమ్‌లో తయారుకాదు. వంటింట్లో తయారవుతుంది` అని సూర్య చేసిన వ్యాఖ్యలు ఫిట్‌నెస్ ప్రేమికుల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.
25 ఏళ్ల వయస్సు దాటిన తర్వాతే తనకు ఈ సత్యం బోధపడిందని నిజాయితీగా అంగీకరించారు. బరువులు ఎత్తడం లేదా ట్రెడ్‌మిల్ మీద పరిగెత్తడం వల్ల ఆశించిన ఫలితాలు రావు. మనం ఏమి తింటున్నాం అనే దానిపైనే శరీర ఆకృతి ఆధారపడి ఉంటుందని పేర్కొ న్నారు. `మనం మన నోటిని అదుపులో పెట్టుకోవాలి` అని ఆయన చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం.. ప్రాసెస్డ్ ఫుడ్ అధిక క్యాలరీల ఆహారాన్ని నియంత్రించడమే. క్రమశిక్షణతో కూడిన డైటింగ్ ప్రారంభించిన తర్వాతే తన శరీరంలో గొప్ప మార్పులు వచ్చాయన్నారు.
శాస్త్రీయంగా ఫిట్‌నెస్‌లో 70 శాతం ఆహారం , 30 శాతం వ్యాయామం పాత్ర ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. జిమ్‌కు వెళ్తున్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అందుకే క్లీన్ ఈటింగ్ ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నారు. సంప్రదాయబద్ధమైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవడమే సుస్థిరమైన ఫిట్‌నెస్‌కు మార్గం. సెలబ్రిటీల జీవితం గ్లామరస్‌గా కనిపించినా? ఆ రూపం వెనుక కఠినమైన ఆహార నియమాలు ఉంటాయని హీరోల మాటలను బట్టి అర్థమవుతోంది.
ఇష్టమైన పదార్థాలను వదులుకోవడం, వేళకు భోజనం చేయడం , చక్కెర, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వంటివి ఒక తపస్సులా చేయాల్సిందే. ఫిట్‌నెస్ అనేది కండలు పెంచడం కాదు. అది క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచితే సరైన ఆహారం ఆ దృఢత్వానికి మెరుగును అద్దు తుంది. ఆరోగ్యక రమైన సమాజం కోసం ఈ స్టార్ హీరోలు అందిస్తున్న ఫిట్‌నెస్ సూత్రాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయం.
