Begin typing your search above and press return to search.

సూర్య సినిమాలో రియల్ కపుల్!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా.. నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు సూర్య.

By:  Madhu Reddy   |   20 Oct 2025 6:00 PM IST
సూర్య సినిమాలో రియల్ కపుల్!
X

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా.. నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు సూర్య. దాదాపు చాలా సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో హిందీలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన తాజాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయారు.ఇప్పటికే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న కరుప్పు సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. మరొకవైపు సూర్య 47 అనే వర్కింగ్ టైటిల్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ను ఫైనలైజ్ చేశారు.


ఈ ప్రాజెక్టుకి జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ 'ఆవేశం' చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ మాధవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అటు సినిమా లవర్స్ లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్న వేళ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం ఇంకాస్త హైప్ పెంచింది అని చెప్పవచ్చు. విషయంలోకి వెళ్తే.. ఒక రియల్ జంట ఇందులో నటీనటులుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ జంట ఎవరో కాదు మలయాళ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా పేరు సొంతం చేసుకున్న ఫహద్ ఫాజిల్ ఆయన సతీమణి ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీమ్.

ఇందులో ఫహద్ విలన్ గా కనిపించనుండగా.. నజ్రియా నజీమ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత అంచనాలను పెంచేసింది. ఇకపోతే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో సూర్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సూర్య కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్షన్ హౌస్ లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

హీరో సూర్య విషయానికి వస్తే.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. తన నటనతో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఆరు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్న ఈయన.. ఐదు తమిళ నాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు అనేక ప్రశంసలు కూడా అందుకున్నారు. అంతేకాదు ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన సెలబ్రిటీ 100 జాబితాలో ఏకంగా ఆరుసార్లు స్థానం సంపాదించుకోవడం గమనార్హం. 22 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన ఈయిన నెరుక్కు నేర్ అనే చిత్రంతో ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశారు.

సూర్య వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2006 సెప్టెంబర్ 11న చెన్నైలో ప్రముఖ హీరోయిన్ జ్యోతికను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మరొకవైపు జ్యోతిక లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు తన భర్తతో కలిసి పలు చిత్రాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది. ఇప్పుడు మరో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించడం విశేషం.