Begin typing your search above and press return to search.

ప‌వ‌న్- సూరి చూపు ఆ హీరోయిన్ వైపా?

`ఏజెంట్` ప్లాప్ తో ఒక్క‌సారిగా సైలైంట్ అయిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే సీరియ‌స్ ప్ర‌య‌త్నంలో ఉన్నాడు.

By:  Srikanth Kontham   |   6 Feb 2026 1:00 PM IST
ప‌వ‌న్- సూరి చూపు ఆ హీరోయిన్ వైపా?
X

`ఏజెంట్` ప్లాప్ తో ఒక్క‌సారిగా సైలైంట్ అయిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే సీరియ‌స్ ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌రీ ఇటీవ‌లే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క‌థ కోస‌మే సూరి చాలా కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హిట్ కంటెంట్ తోనే రావాల‌ని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్సై చేస్తోన్న ప్రాజెక్ట్ ఇది. రాక‌రాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో వ‌చ్చిన అవ‌కాశంతో గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ప్రాజెక్ట్ అధికారికంగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లు పెట్ట‌డానికి రెడీ అవుతున్నారు.

ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. అయితే ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా ఏహీరోయిన్ ని ఎంపిక చేసారు? అన్న‌ది ఇంత వ‌ర‌కూ వెల్ల‌డించ‌ని సంగ‌తి తెలిసిందే. దీంతో ప‌వ‌న్ తో ఛాన్స్ అందుకునే హీరోయిన్ ఎవ‌రు? అంటూ నెట్టింట చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఈ నేప‌థ్యంలో సూరి చూపు ` ఫౌజీ` బ్యూటీపై మ‌ళ్లిన‌ట్లు తెలిసింది. ఇమ్మాన్వి ఇస్మైల్ ని తీసుకుంటే బాగుంటుంద‌ని టీమ్ తో చ‌ర్చిస్తున్నారుట‌. ఈ విష‌యం ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్ల‌గా సానుకూలంగా స్పందించారుట‌. ఈ విష‌యంలో తాను క‌ల్పించుకోన‌ని పాత్ర‌కు ఎవ‌రు సూటు వుతున్నారో? వారినే ఎంపిక చేయాల్సిందిగా చెప్పారుట‌.

దీంతో హీరోయిన్ ఎంపిక ప‌నంతా సూరిపైనే ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. హీరోయిన్ల ఎంపిక విష‌యంలో సూరి యూనిక్ గానే ఉంటాడు. పాత్ర‌కు సూట‌య్యే వారినే ఎంపిక చేస్తాడు. అందుకోసం గ్రౌండ్ వ‌ర్క్ బాగానే చేస్తాడు. తొంద‌ర‌ప‌డి ఎవ‌ర్ని ప‌డితే వారిని తీసుకోడు. ఆయ‌న గ‌త సినిమా హీరోయిన్ల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం అర్ద‌మ‌వుతుంది. ఇమేజ్ ఉన్న వారికంటే పాత్ర‌కు సెట్ అయ్యే వారికే ప్రాధాన్య‌త ఇస్తాడు. ఆ త‌ర్వాత ఇమేజ్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాడు. ఈసారి కూడా అదే ప్రాస‌స్ లో ఎంపిక జ‌రుగుతుంది. ఇమాన్వీ ఇప్ప‌టికే పాన్ ఇండియా చిత్రం `పౌజీ`లో ప్ర‌భాస్ కి జోడీగా న‌టిస్తోంది.

అమ్మ‌డు వెరీ ట్యాలెంటెడ్. మంచి డాన్స‌ర్ కూడా. వీటిని ప‌ట్టుకునే సూరి కూడా మూవ్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది. సూరి సినిమాకు ఇమాన్వీ మ‌రో ర‌కంగానూ ప్ల‌స్ అవుతుంది. `పౌజీ` రిలీజ్ ప‌వ‌న్ సినిమా కంటే ముందే ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే ఆ క్రేజ్ పీకే సినిమాకు క‌లిసొస్తుంది. ఇప్ప‌టికే ఇమ్మాన్వీ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ బ్యూటీ. ఒక్క డాన్స్ వీడియోతోనే నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.