Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ట్రోల్స్ కి సురేఖవాణి స్ట్రాంగ్ కౌంటర్.. ఇప్పటికైనా మార్పు వస్తుందా?

సెలబ్రిటీలైతే చాలు నెటిజన్స్ కన్ను మొత్తం ఆ సెలబ్రిటీలపైనే ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Madhu Reddy   |   2 Aug 2026 11:08 AM IST
సోషల్ మీడియా ట్రోల్స్ కి సురేఖవాణి స్ట్రాంగ్ కౌంటర్.. ఇప్పటికైనా మార్పు వస్తుందా?
X

సెలబ్రిటీలైతే చాలు నెటిజన్స్ కన్ను మొత్తం ఆ సెలబ్రిటీలపైనే ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయటకు వెళ్లినా.. ఎవరితో నైనా చనువుగా ఉన్నా లేదా సోషల్ మీడియాలో కాస్త గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేసిన సరే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వారిపై విపరీతమైన రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు వాటిని అడ్డం పెట్టుకొని సెలబ్రిటీలను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తనపై , తన కూతురిపై వస్తున్న ట్రోల్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది సురేఖ వాణి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన సురేఖ వాణి..

ప్రముఖ సినీనటి సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి కరోనా సమయం నుంచే ఎక్కువగా సోషల్ మీడియాలో గడపడం మొదలుపెట్టారు. అలా వెకేషన్ కి వెళ్లడం, కలసి ఎంజాయ్ చేయడం, చిట్టి పొట్టి బట్టలతో గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. అదే సమయంలో సురేఖ వాణి పెళ్లీడుకొచ్చిన కూతురితో గ్లామర్ విషయంలో పోటీపడుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. అంతటితో ఆగకుండా చాలా దారుణంగా ఆమెను తిట్టిపోస్తూ రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యింది అంటూ రూమర్స్ సృష్టించడమే కాకుండా అటు సోషల్ మీడియా వేదికగా మీమ్స్ తో హల్చల్ చేశారు. ఇలా ఒక్కటేమిటి ఈ తల్లి కూతుర్లపై ఎన్నో రకాల ట్రోల్స్, మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాటన్నింటికీ కూడా సురేఖ వాణి చెక్ పెట్టింది.

రూమర్స్ పట్టించుకోవడం ఎప్పుడో మానేశా - సురేఖ వాణి

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం నీరమ్. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో పాల్గొన్న సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.. "సోషల్ మీడియాలో మా గురించి ఎన్ని వార్తలు రాసినా..మేం పెద్దగా పట్టించుకోము. ఒకప్పుడు పట్టించుకోని బాధపడ్డాము. ఇక ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడి.. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనే పద్ధతిలోనే మేము వ్యవహరిస్తున్నాము. ముఖ్యంగా పక్క వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లేదు. అంత సమయము లేదు.. మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్తాము" అంటూ సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పింది సురేఖ వాణి

మళ్లీ పెళ్లి వార్తలపై సురేఖ వాణి క్లారిటీ..

మరొకవైపు సురేఖ వాణి మళ్లీ పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు రాగా.. అటు సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా మా అమ్మకు వివాహం చేసిన తర్వాత నేను వివాహం చేసుకుంటాను. ఆమె సంతోషంగా ఉన్నప్పుడే నేను వైవాహిక బంధంలోకి అడుగుపెడతాను. అయితే ఒక మంచి తోడు దొరికే వరకు వెతుకుతాను అంటూ తన తల్లి రెండవ పెళ్లిపై కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీంతో అందరూ సురేఖవాణి రెండో పెళ్లికి సిద్ధమయ్యింది అంటూ పలు రకాల ఊహాగానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఇదే ప్రెస్ మీట్ లో రేఖా వాణి మాట్లాడుతూ.. నా కూతురు పెళ్లి వయసుకు వచ్చింది. ఈ వయసులో నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ప్రస్తుతానికైతే నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన రాదు. ముఖ్యంగా నా భర్త స్థానంలో ఇంకొకరిని నేను ఊహించుకోలేను" అంటూ సురేఖ వాణి తెలిపింది. మొత్తానికైతే ఇంత క్లారిటీగా సురేఖ వాణి చెప్పడంతో కనీసం ఇకనైనా నెటిజన్స్ ఇలాంటి ట్రోల్స్ చేయడం ఆపేస్తారా? అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.