మోకాళ్లపై శ్రీవారి మెట్లెక్కిన ప్రముఖ నటి కూతురు!
కలియుగ దైవంగా పిలిచే వెంకటేశ్వర స్వామి ఆలయానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శించుకుంటారు.
By: Madhu Reddy | 29 Oct 2025 4:38 PM ISTకలియుగ దైవంగా పిలిచే వెంకటేశ్వర స్వామి ఆలయానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శించుకుంటారు. అలా తిరుమల శ్రీవారిని రోజు వేలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సామాన్య ప్రజలు మాత్రమే కాదు ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులు కూడా తరచూ తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు విఐపి హోదాలలో స్పెషల్ గా వెళితే.. మరి కొంత మంది మాత్రం మెట్ల మార్గాన సాదాసీదాగా వెళ్తారు. అయితే చాలామంది సెలబ్రిటీలు మాత్రం స్పెషల్ దర్శనాలనే ఎంచుకుంటారు. వారికున్న బిజీ షెడ్యూల్ లో అలా వచ్చి ఇలా దర్శించుకుని వెళ్ళిపోతారు.కానీ కొంతమంది కోరుకున్న కోరికలు తీరడం కోసం లేక మొక్కులు తీర్చుకోవడం కోసం ఇలా సాధారణ ప్రజల లాగే మెట్ల మార్గాన వెళ్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో ఉండే ఒక ప్రముఖ నటి కూతురు ఏకంగా మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మరి ఇంతకీ ఆ ప్రముఖ నటి కూతురు ఎవరో కాదు.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో రాణించిన సురేఖ వాణి కూతురు సుప్రీత.. సమయం దొరికితే చాలు తల్లి కూతుర్లు ఇద్దరు పార్టీలు, పబ్బులు, వెకేషన్ లు అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అటు ఎంజాయ్ చేయడంతో పాటు ఈ తల్లి కూతుర్లకు భక్తి కూడా ఎక్కువే. అలా ఏడాదికి రెండు మూడు సార్లు సురేఖ వాణి, సుప్రీత ఇద్దరు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
అయితే తాజాగా సురేఖ వాణి, సుప్రీత ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ సుప్రీత మాత్రం ఈసారి మోకాళ్ళ మీద నడిచి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకొని తన భక్తి భావాన్ని చాటుకుంది. ప్రస్తుతం సుప్రీత మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన ఫోటోలు,వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు సుప్రీతకి భక్తి ఎక్కువే అంటుంటే..మరికొంతమందేమో ఏదో బలమైన కోరికే కోరుకున్నట్టు ఉంది. అందుకే ఎంత కష్టమైనా సరే మోకాళ్ళ మీద కొండ ఎక్కింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సుప్రీత ప్రస్తుతం బిగ్ బాస్ 7 రన్నరప్ అయినటువంటి సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరితో కలిసి ఓ సినిమా చేస్తోంది. చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అలా తన మొదటి సినిమా హిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే సుప్రీత మోకాళ్ళ మీద ఏడుకొండల వాడిని దర్శించుకుందేమో అని కొంతమంది భావిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు రీసెంట్ గానే సుప్రీత మరో సినిమాకి కూడా సైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీత మోకాళ్ళ మీద తిరుమల మెట్లు ఎక్కిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. సురేఖ వాణి - సుప్రీతల విషయానికొస్తే ..వీరిద్దరూ తల్లి కూతుర్లలా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లా కనిపిస్తారు.ఎక్కడికి వెళ్లినా జంటగా వెళుతూ తమకంటూ ఒక మంచి పేరు దక్కించుకున్నారు.
