Begin typing your search above and press return to search.

కొండా సురేఖ వ్యాఖ్యలు.. నాగచైతన్య రెస్పాన్స్ ఇదే..

అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. చైతూ, సామ్ విడాకుల అంశంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:14 PM GMT
కొండా సురేఖ వ్యాఖ్యలు.. నాగచైతన్య రెస్పాన్స్ ఇదే..
X

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత.. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. డివోర్స్ తర్వాత ఇద్దరూ తమ లైఫ్ లను లీడ్ చేస్తున్నారు. రీసెంట్ గా చైతూ.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలో ఆమెతో ఏడడుగులు నడవనున్నారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. చైతూ, సామ్ విడాకుల అంశంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

బీఆర్ఎస్ నేత కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని బుధవారం మధ్యాహ్నం కొండా సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో హీరోయిన్ సమంత రెస్పాండ్ అయ్యారు. తన విడాకుల విషయం పూర్తిగా వ్యక్తిగతమని, పరస్పర అంగీకారంతో జరిగాయని తెలిపారు. ఆ విషయంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు హీరో నాగచైతన్య కూడా స్పందించారు. తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ ను ఆయన రీట్వీట్ చేశారు.

"గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్ధులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం" అంటూ నాగ్ పోస్ట్ చేయగా.. దానిని చైతూ రీ పోస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే?

బీసీ మహిళ అయిన తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందని ఆరోపించారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొందరు ఇబ్బంది పడ్డారని, మరికొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఆమె ఆరోపించగా.. ఇప్పుడు చైతూ సోషల్ మీడియాలో స్పందించారు.