జాన్వీకపూర్ SSKTK మూవీ పై ప్రముఖ నటి అసహనం.. ఏమైందంటే?
కాంతార: చాప్టర్ 1 మూవీకి పోటీగా గాంధీ జయంతి రోజు విడుదలైన జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ ల సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి (SSKTK) సినిమాకి బాక్సాఫీస్ వద్ద వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
By: Madhu Reddy | 4 Oct 2025 9:00 PM ISTకాంతార: చాప్టర్ 1 మూవీకి పోటీగా గాంధీ జయంతి రోజు విడుదలైన జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ ల సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి (SSKTK) సినిమాకి బాక్సాఫీస్ వద్ద వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ సినిమా కాంతార: చాప్టర్ 1 సినిమాకి పోటీగా విడుదలై ఆ సినిమా ముందు నిలబడలేకపోయింది. పైగా ఈ సినిమా చూసిన వారు కూడా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాపై సామాన్య జనాలే కాదు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
జాన్వీ కపూర్ మూవీ నటి అసహనం..
ఈ క్రమంలోనే తాజాగా ఓ బుల్లితెర నటి సోషల్ మీడియాలో ఈ సినిమాను ఉద్దేశించి పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఆ నటి ఎవరు అంటే టెలివిజన్ నటి సురభి చందన. రీసెంట్ గా ఈమె తన భర్త కరణ్ శర్మతో కలిసి సన్నీ సంస్కారికీ తులసీ కుమారి సినిమాకి వెళ్ళింది. ఇంటర్వెల్ టైంలో సమోసా తింటూ ఆస్వాదిస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. "ఈ సినిమాలోని ఏకైక మంచి భాగం ఇదే" అంటూ సమోసా తినడాన్ని ఉద్దేశించి పోస్ట్ పెట్టింది.
ఆపండి అంటూ..
అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వీడియోని ఈమె భర్త కరణ్ కూడా తిరిగి షేర్ చేస్తూ.."సురభి నన్ను ఈ చెత్తలోకి లాగినందుకు నిన్ను నిందిస్తున్నాను" అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు కరణ్ శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో మరో వీడియో కూడా పోస్ట్ చేశారు.ఆ వీడియోలో సన్నీ సంస్కారీకీ తులసి కుమారి సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుండగా.. జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది.అలా పరిగెత్తుకొచ్చే సీన్ ని చూస్తున్న సురభి చాలా నిరాశతో "అరే.. ఆపు ఆపు ఎవరైనా ఈ సినిమాని ఇప్పుడే ఆపేయండి" అంటూ గట్టిగా అరిచింది. ఈ వీడియోని కూడా షేర్ చేస్తూ కరణ్ శర్మ బాలీవుడ్ కొత్త సామూహిక విధ్వంసక ఆయుధం అంటూ రాసుకొచ్చారు. దీనిని సురభి రీ పోస్ట్ చేస్తూ.." మేము అందులో నుండి బయటపడ్డాం" అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం సురభి చందన, కరణ్ శర్మ ఇద్దరూ సన్నీ సంస్కరీ కీ తులసి కుమారి సినిమా చూస్తూ ఆ సినిమాపై చేసిన విమర్శలు, నెగిటివ్ పోస్టులు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది సినిమా చూడని జనాలు ఏంటి? సినిమా మరీ ఇంత దారుణంగా ఉందా.. ? ఇలాంటి రివ్యూ ఇస్తున్నారు అంటూ షాక్ అవుతున్నారు.
సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి సినిమా విశేషాలు..
సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి సినిమా విషయానికి వస్తే. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్,సన్యా మల్హోత్రా, రోహిత్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో తమ మాజీ ప్రేమికుల పై రివేంజ్ తీర్చుకోవడం కోసం వరుణ్ జాన్వీలు చేయి కలిపి తమ మాజీ లవర్ ల పెళ్లిని చెడగొట్టాలని చూస్తారు. ఇదే సినిమా స్టోరీ. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.13.10 కోట్లు మాత్రమే వసూలు చేసిందని పలు వెబ్ సైట్ లు తెలిపాయి..
