స్టార్ హీరో భార్యకు ఆన్ లైన్ వేధింపులు
ఇప్పుడు ప్రముఖ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ సుకుమారన్ ని ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేస్తున్న ఒక యువతి గురించిన వివరాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
By: Sivaji Kontham | 31 July 2025 9:10 AM ISTసోషల్ మీడియాల్ని సరైన విధానంలో ఉపయోగించేవారి కంటే దుర్వినియోగపరిచే వారే ఎక్కువ. ఇప్పుడు ప్రముఖ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ సుకుమారన్ ని ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేస్తున్న ఒక యువతి గురించిన వివరాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఆ యువతి అమెరికన్ యువతి. చూడటానికి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఆమె నిరంతరం ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సుప్రియను వేధించడమే ధ్యేయంగా జీవిస్తోంది. సుప్రియపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలను ఆన్ లైన్ లో రాస్తుంది. ప్రతిసారీ ఖాతాను మారుస్తూ, కొత్త పోస్టులతో ఆటాడుతుంది. 2018 నుంచి ఇలా వేధింపుల సైకిల్‌ని కొనసాగించడానికి డజన్ల కొద్దీ నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించింది.
కొన్నిసార్లు అసహ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంది ఈమె. @christinaeldo పేరుతో ఆమె దారుణ వ్యాఖ్యలు చేస్తుంది. నకిలీ ఖాతాలలో ఏదో ఒకటి పోస్ట్ చేసేది. ఆమెను బ్లాక్ చేస్తూనే ఉన్నా.. ఫలితం లేదు. కొన్నేళ్ల క్రితమే ఆమె ఎవరో కనుక్కొన్నానని.. కానీ ఆమెకు ఒక చిన్న కొడుకు ఉన్నందున అలా వదిలేసాను అని కూడా తెలిపారు.
అప్పుడప్పుడు కాదు.. ప్రతిరోజూ ఆమెకు సోషల్ మీడియా పోస్టింగులతోనే బిజీ. అయితే ఇలాంటి వాటిలో చేరకుండా ఉంటే సరిపోతుందని సుప్రియ భావించింది. కానీ సదరు యువతి పోస్టింగులు విషంలా మారాయి. వేధింపులు హద్దు మీరాయి. సుప్రియ దివంగత తండ్రి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా షాకింగ్. ఆ తర్వాత సదరు యువతి పోస్టింగులపై ఎటాక్ చేయడం ప్రారంభించారు సుప్రియ. ఇంకా ఎటువంటి చట్టపరమైన చర్యను తీసుకుంటున్నట్టు సుప్రియ ప్రకటించలేదు. సైబర్ బెదిరింపు, ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపాలనే ఆలోచనతో మాత్రం సుప్రియ ఉన్నారని సమాచారం. ఇలా ఒకరి తప్పును బహిర్గతం చేసిన గట్సీ ఉమెన్ సుప్రియ సుకుమారన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
