Begin typing your search above and press return to search.

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

పంకజ్ కపూర్‌తో తన వివాహం జరిగి 38 ఏళ్లు పూర్తయ్యాయని నటి సుప్రియా పాఠక్ వెల్లడించారు. పెళ్లి సమయంలో గంటలోపు వేడుక పూర్తికాకపోతే అక్కడి నుంచి వెళ్లిపోతానని పంకజ్ హెచ్చరించారట. పెళ్లి జరుగుతున్నంతసేపు గడియారం చూస్తూనే ఉన్నారని ఓ షోలో సరదాగా గుర్తుచేసుకున్నారు. 1988లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 12:00 AM IST
పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!
X

బాలీవుడ్ సీనియ‌ర్ జోడీల గురించి చెప్పాల్సి వ‌స్తే? అందులో పంకజ్ కపూర్ -సుప్రియా పాఠక్ ల గురించి త‌ప్ప‌క ప్ర‌స్తావించాల్సిందే. సహజమైన నటనతో.. వైవిధ్యమైన పాత్రలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న జోడీ ఇది.

ఒకవైపు నేషనల్ అవార్డుల స్థాయిలో వైవిథ్య‌మైన‌ పాత్రలతో పంకజ్ కపూర్ మెప్పిస్తుంటే.. మరోవైపు పవర్‌ఫుల్ పాత్రలతో సుప్రియా పాఠక్ వెండి తెర‌పై తనదైన ముద్ర వేస్తున్నారు. 1988లో ప్రేమ వివాహంతో ఒక్కటైన ఇద్ద‌రు కెరీర్ పరంగానే కాదు. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఎత్తుపల్లాలను దాటారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ జోడీ వివాహానికి సంబంధించిన ఓ స‌ర‌దా మూవ్ మెంట్ ని సుప్రియా పాఠక్ ఓ షోలో బయట పెట్టారు. పెళ్లి మండపంలో భర్త పంకజ్ కపూర్ పెట్టిన విచిత్రమైన డెడ్‌లైన్ గురించి చెప్పి అందరినీ నవ్విచించారు. ఓ షోలో హోస్ట్ సెలబ్రిటీల పెళ్లి నాటి అరుదైన ఫోటోలను స్క్రీన్ పై ప్రదర్శించారు. అందులో భాగంగా సుప్రియా పాఠక్- పంకజ్ కపూర్ వివాహానికి సంబంధించిన ఫోటో కనిపించగానే అందులో పంకజ్ కపూర్ సీరియస్‌గా.. కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని కపిల్ సరదాగా వ్యాఖ్యానించారు.

దీనికి సుప్రియా పాఠక్ ఆ ఫోటో వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు. `పంకజ్ కపూర్.. నాకు పెళ్లై 38 ఏళ్లు అవుతోంది. అయితే మా వివాహ వేడుక సమయంలో ఆయన నాకు ఓ క‌ఠిన‌మైన నిబంధ‌న‌ పెట్టారు. పెళ్లి గంటలోపు పూర్తి కాకపోతే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతానని హెచ్చరించారు. అంతేకాదు పెళ్లి తంతు గంటలో ముగుస్తోందా లేదా అని పెళ్లి జరుగుతున్నంత సేపు పదే పదే గడియారం చూసుకుంటూనే ఉన్నారని` న‌వ్వేసారు.

వాస్త‌వానికి పంకజ్ కపూర్- సుప్రియా పాఠక్‌లు అప్పటికే వేర్వేరుగా వివాహాలు జరిగాయి. కానీ అనివార్య కార‌ణాల‌తో విడిపోయారు. కొంత కాలం పాటు ప్రేమలో ఉన్న జోడీ1988లో పెద్దల సమక్షంలో నిరాడంబరంగా ఒక్కటయ్యారు. అయితే పంకజ్ కపూర్ మొదటి భార్య నీలిమా అజీమ్ కుమారుడు షాహిద్ కపూర్ బాధ్యతలను కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులు వేశారు. అలాగ‌ని ఆమె వివాహానికి దూరంగా లేరు. ఆ త‌ర్వాత మ‌రో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. రెండ‌వ వివాహంగా రాజేష్ క‌ట్ట‌ర్ ని పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన బిడ్డ ఇషాన్ ఖట్టర్. అటుపై 2001లో విడాకులతో ఆ బంధం ముగిసింది. అనంత‌రం మూడవ వివాహం రజా అలీ ఖాన్ తో జ‌రిగింది. 2009లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు.