Begin typing your search above and press return to search.

పూల లెహంగాలో ఆకట్టుకుంటున్న సుప్రీత.. లేటెస్ట్ లుక్ వైరల్!

ఇక జుట్టును పొనీటైల్ చేసిన ఈమె.. సిల్వర్ కలర్ జువెలరీ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. మొత్తానికైతే లెహంగా అందాలతో చూడచక్కని బొమ్మలా అందరి దృష్టిని ఆకర్షించింది సుప్రీత .

By:  Madhu Reddy   |   10 Jun 2026 2:51 PM IST
పూల లెహంగాలో ఆకట్టుకుంటున్న సుప్రీత.. లేటెస్ట్ లుక్ వైరల్!
X

సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఊహించని పాపులారిటీ ఉంటుంది. ఆ పాపులారిటీని ఉపయోగించుకొని సెలబ్రిటీలు అభిమానులకు దగ్గర అవ్వడమే కాకుండా తమ వారసులను, కుటుంబ సభ్యులను కూడా ఆడియన్స్ కు దగ్గర చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే తల్లితో సమానంగా ఆదరణ అందుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది సుప్రీత. సీనియర్ నటీమణి సురేఖ వాణి కూతురిగా సోషల్ మీడియా యూజర్స్ కి పరిచయమైన ఈ చిన్నది అక్కడ తన తల్లితో కలిసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ మరింత వైరల్ అయింది.

లెహంగా లుక్ లో సుప్రీత అందాలు..

ముఖ్యంగా కరోనా సమయంలో తల్లితో గడిపిన ప్రతి సందర్భాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఊహించని ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో లంగా వోణీ, చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఒకవైపు సాంప్రదాయంగా కనిపిస్తూనే.. మరొకవైపు తన గ్లామర్ అందాలతో కుర్ర కారుకు కునుకు లేకుండా చేస్తోందని చెప్పవచ్చు. ఈమె ధరించిన లేటెస్ట్ లెహంగా విషయానికి వస్తే.. ఆరంబ్ బ్రైడల్ స్టూడియో డిజైన్ చేసిన ప్రింటెడ్ లంగాకు దీనికి కాంబినేషన్లో హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ ఆలివ్ గ్రీన్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది. అలాగే ఆలివ్ గ్రీన్ కలర్ చున్నీతో తన మేకోవర్ ను ఫుల్ ఫీల్ చేసుకుంది.

ట్రెడిషనల్ లుక్ కి కుర్రకారు ఫిదా..

ఇక జుట్టును పొనీటైల్ చేసిన ఈమె.. సిల్వర్ కలర్ జువెలరీ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. మొత్తానికైతే లెహంగా అందాలతో చూడచక్కని బొమ్మలా అందరి దృష్టిని ఆకర్షించింది సుప్రీత . ఇక సుప్రీత లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిత్యం చిట్టి పొట్టి బట్టలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెడిషనల్ గా తయారవుతూ అందరి దృష్టిని ఆకట్టుకోవడంతో అమ్మడిలో మార్పు వచ్చింది అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు

హీరోయిన్ గా తొలి అడుగు..

ఇక సుప్రీత సినిమాల విషయానికి వస్తే.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, సీరియల్ నటుడు అమర్దీప్ చౌదరితో కలిసి చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. మల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని m3 మీడియా పతాకం పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించక ముందు ఈయన వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అప్పుడే ఇండస్ట్రీ అరంగేట్రం చేసిన సుప్రీత..

ఈ చిత్రం ద్వారా సుప్రీతా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నప్పటికీ ముందుగానే నటిగా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో వచ్చిన లేచింది మహిళా లోకం సినిమాలో కీలకపాత్ర పోషించింది సుప్రీత. అలా ఈ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. కార్తీక్ - అర్జున్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో సుప్రీతా కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం పలు టీవీ షో లలో హోస్ట్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది.