టికెట్ రేట్లపై సుప్రీం కోర్టు ఏమందంటే
దేశంలోని మల్టీప్లెక్స్లుల్లో టికెట్ ధరలతో పాటూ పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ రేట్లు భారీగా ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
By: Sravani Lakshmi Srungarapu | 4 Nov 2025 10:08 PM ISTదేశంలోని మల్టీప్లెక్స్లుల్లో టికెట్ ధరలతో పాటూ పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ రేట్లు భారీగా ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, లేకపోతే ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేసి ఓటీటీల వైపే ఇంట్రెస్ట్ చూపిస్తారని, అప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంటాయని కోర్టు హెచ్చరించింది.
కర్ణాటక ప్రభుత్వం మల్టీప్లెక్స్ టికెట్ ధరలను రూ. 200కు పరిమితం చేస్తూ రీసెంట్ గా ఆదేశాలు జారీ చేయగా, ఆ డెసిషన్ ను ఛాలెంజ్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ధరలను తగ్గించి, ఆడియన్స్ కు అందుబాటులో ఉండేలా చేస్తే పరిశ్రమ బాగుపడుతుందని, లేకపోతే ఆడియన్స్ రాకుండా హాళ్లు ఖాళీగా మిగిలిపోతాయని, టికెట్ రేటు రూ.200 ఉండాలనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆ వాదనలకు పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, టికెట్ రేట్లను పెంచుకోవడమనేది ఎంచుకునే స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు పెట్టిన కండిషన్స్ ఆచరణకు సాధ్యం కావని, టికెట్ కౌంటర్స్ లో డబ్బులిచ్చి టికెట్ కొనే వారి వివరాలు సేకరించాలనే ఆదేశాన్ని తప్పుబట్టారు.
ఈ కేసుపై ఇరు వాదనలు విన్న సుప్రీం కోర్టు, ఈ పిటిషన్లపై నోటీసులు జారీ చేసింది. అయితే హైకోర్టు విధించిన మధ్యంతర కండిషన్లు వెంటనే అమలు కాకుండా వాటిపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసిది.
