Begin typing your search above and press return to search.

టైటిల్ వివాదంలో చిక్కుకున్న మనోజ్ బాజ్పేయ్ మూవీ.. ఇప్పటి వరకు ఆ జాబితాలో చేరిన చిత్రాలెన్నో!

ఈ సినిమా శీర్షికపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వర్గాన్ని కించపరిచేలా టైటిల్స్ పెట్టడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు రాదని స్పష్టం చేసింది.

By:  Madhu Reddy   |   12 Feb 2026 10:00 PM IST
టైటిల్ వివాదంలో చిక్కుకున్న మనోజ్ బాజ్పేయ్ మూవీ.. ఇప్పటి వరకు ఆ జాబితాలో చేరిన చిత్రాలెన్నో!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటనకు చిరునామాగా నిలిచే నటులలో మనోజ్ బాజ్‌పేయీ ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల లో నటించారు. ఇప్పుడు తాజాగా మనోజ్ బాజ్‌పేయ్ నటించిన ‘గూస్కోర్ పండిట్’ సినిమా టైటిల్ పైన వివాదం చోటుచేసుకుంది. సినిమాకు టైటిల్ అనేది ప్రాణం వంటిది. కానీ ఒక్కోసారి అదే టైటిల్ చిత్ర యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ఈ సినిమా శీర్షికపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వర్గాన్ని కించపరిచేలా టైటిల్స్ పెట్టడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు రాదని స్పష్టం చేసింది. వివరాలలోకి వెళితే ..

సుప్రీంకోర్టు హెచ్చరిక:

నీరజ్ పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఓ సామజిక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం "సమాజంలోని ఒక వర్గాన్ని ఎందుకు కించపరచాలి?" అని సూటిగా ప్రశ్నించింది. అసలు విషయం ఏమిటంటే, ఫిబ్రవరి 19లోగా కొత్త పేరుతో అఫిడవిట్ దాఖలు చేయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కోర్టు ఖచ్చితంగా చెప్పేసింది. దీంతో ఇప్పుడు చిత్ర బృందం డైలమాలో పడింది.

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సినిమాలు:

ఇలా టైటిల్ మార్చమని కోర్టు మెట్లు ఎక్కడం సినీ ఇండస్ట్రీలో ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సినిమాలు చివరి నిమిషంలో ఇలాంటి టైటిల్ వివాదాల వల్ల పేర్లు మార్చుకున్నాయి. వాటిలో సంజయ్ లీలా భన్సాలీ తీసిన చిత్రం మొదట ‘పద్మావతి’గా ఉండేది. కర్ణి సేన ఆందోళనల వల్ల చివరికి ఒక అక్షరాన్ని తీసేసి ‘పద్మావత్’గా మార్చారు. ఇక తెలుగులో కూడా వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా టైటిల్‌ను చివరి నిమిషంలో ‘గద్దలకొండ గణేష్’గా మార్చాల్సి వచ్చింది. ఇక పోతే, ఇలాంటి వివాదాలు సినిమాకు నెగటివ్ పబ్లిసిటీ తెచ్చినప్పటికీ, అటు నైతికతను, ఇటు ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత మేకర్స్‌పై ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేస్తోంది.

మనోజ్ బాజ్‌పేయీ సిని కెరీర్ :

మూడు దశాబ్దాలకు పైగా నటిస్తున్న అయన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా 'సత్యా' సినిమాలో ఆయన పోషించిన భిక్కు మాత్రే పాత్ర బాలీవుడ్ చరిత్రలోనే ఐకానిక్ విలన్ పాత్రగా నిలిచిపోయింది. ఆ తర్వాత 'శూల్', 'పింజర్', 'రాజనీతి' వంటి సినిమాలతో తనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. అయితే, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మాత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' లోని సర్దార్ ఖాన్ పాత్రే అని చెప్పాలి. ఇక పోతే, ఓటీటీ వేదికగా వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ద్వారా శ్రీకాంత్ తివారీగా ఆయన పండించిన హాస్యం, ఎమోషన్స్ కుర్రకారు నుంచి పెద్దల వరకు అందరినీ కట్టిపడేశాయి. ఇక నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడమే కాదు, ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్నారు.