ఖాకీని లైన్ లోకి తెస్తోన్న సూపర్ స్టార్!
కోలీవుడ్ పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి సినిమాలకు సంబంధించి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.
By: Srikanth Kontham | 21 July 2026 12:54 PM ISTకోలీవుడ్ పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి సినిమాలకు సంబంధించి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న రజనీకాంత్ విభిన్నమైన దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్‌తో రజనీకాంత్ ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిభావంతులైన దర్శకులను, విభిన్నమైన ఆలోచనలు ఉన్న టెక్నీషియన్లను వెతికి పట్టుకోవడంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ముందుంటారు.
ఇప్పటి వరకూ తన కెరీర్‌లో ఎంతోమంది కొత్త ..సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చి సంచలన విజయాలను అందుకున్నారు. హెచ్. వినోద్ విషయానికి వస్తే.. ఆయన సినిమాలలో బలమైన సామాజిక అంశాలు, పదునైన సంభాషణలు , హై-ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు, వినోద్ టేకింగ్ స్టైల్‌కు సరైన కథ పడితే తిరుగుండదు. వినోద్ `ఖాకీ` చిత్రంతో దర్శకుడిగా ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లోయాక్షన్ చిత్రాలకే బాప్ లాంటి సినిమా తీసి శభాష్ అనిపించాడు.
దీంతో వినోద్ దర్శకత్వంలో రజనీ నటిస్తే ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో? అభిమానుల ఊహకి కూడా ఉండటం అందడం లేదు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ కోలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో మాత్రం ఈ కాంబినేషన్‌పై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రజనీకాంత్ గత చిత్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మరింత పకడ్బందీ స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్. వినోద్ వినిపించిన లైన్ రజనీకి నచ్చడంతోనే చర్చలు ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దర్శకుడిగా హెచ్. వినోద్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ హంగులతో పాటు సమాజానికి మంచి సందేశం ఉండేలా ఆయన సినిమాలను తెరకెక్కిస్తుంటారు. రజనీకాంత్ వంటి గ్లోబల్ స్టార్‌తో సినిమా అంటే వినోద్ టాలెంట్‌ను మరింత విస్తృతంగా చూపించడానికి అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాలిస్తే వెండితెరపై సరికొత్త రికార్డులు సృష్టించే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. ప్రస్తుతం రజనీకాంత్ `జైలర్ 2 `షూటింగ్ లో...వినోద్ `జన నాయగన్` రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.` జైలర్ 2` నుంచి రిలీజ్ అవ్వగానే రజనీకాంత్ మరో కొత్త ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తారు. వినోద్ కి కూడా మరో స్టార్ హీరోతో కమిట్ మెంట్ ఉంది. ఆ రెండు పూర్తయిన తర్వాత రజనీకాంత్-వినోద్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
