తిరిగి వస్తున్న సూపర్ హీరోస్..2027 వరకూ నో గ్యాప్!
సినిమా అంటేనే ఒక ఫ్యాషన్.. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి.. అయితే అందర్నీ అలరించేలా సినిమాలు చేయాలంటే కష్టం.
By: Madhu Reddy | 5 Aug 2025 2:10 PM ISTసినిమా అంటేనే ఒక ఫ్యాషన్.. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి.. అయితే అందర్నీ అలరించేలా సినిమాలు చేయాలంటే కష్టం. అయితే కొన్ని సినిమాలు మాత్రం చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలలో సూపర్ హీరోల సినిమాలు ముందుంటాయి అని చెప్పుకోవచ్చు. సూపర్ హీరోలు అంటే చిన్నపిల్లలే కాదు పెద్ద వాళ్లకు కూడా ఇష్టమే. అలా ఒకప్పుడు సూపర్ హీరోలుగా తెరమీదకి వచ్చిన ఎన్నో సినిమాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అలరించాయి. అయితే అలాంటి సూపర్ హీరోల మూవీలు ఇప్పటి జనరేషన్ వాళ్లను కూడా అలరించడం కోసం మళ్లీ తిరిగి వచ్చేస్తున్నాయి. అంతేకాదు 2027 వరకు గ్యాప్ లేకుండా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు సూపర్ హీరోలు. మరి ఇంతకీ త్వరలో విడుదల కాబోతున్న ఆ సూపర్ హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏంటి? ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జేమ్స్ గన్ డైరెక్షన్లో.. పీటర్ సాఫ్రాన్, జేమ్స్ గన్ సంయుక్తంగా నిర్మించిన 'సూపర్ మ్యాన్ 'మూవీ . 2025 జూలై 11న విడుదలైన సంగతి తెలిసిందే. డీసీ నుండి తీసుకున్న పాత్రలతో 'సూపర్ మ్యాన్' మూవీ తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆలరించడమే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా భారీగా వసూళ్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు సూపర్ మ్యాన్ హీరోస్ ని ఇక తెరమీద చూడలేం అనుకున్న సమయంలో జేమ్స్ గన్ చేసిన ఈ ప్రయోగానికి చాలామంది ఫిదా అయ్యారు. ఈ సినిమాలో డేవిడ్ కోరన్ స్వెట్ తోపాటు రాచెల్ బ్రోస్నహాన్,నీకోలస్ హౌల్ట్ లు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక మరో మూవీ 'స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే'. ఈ సినిమా వచ్చే ఏడాది అనగా 2026 సెప్టెంబర్ 31న విడుదల కాబోతోంది. డెస్టిన్ డేనియల్ క్రెటన్ డైరెక్షన్లో వస్తున్న స్పైడర్ మ్యాన్ మూవీలో టామ్ హాలండ్ ,జెండయా,
జాన్ బెర్నాత్ల్ లు నటిస్తున్నారు. ఇక స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మార్వెల్ యొక్క సూపర్ హీరో ఫ్రాన్సిస్ లో నాలుగో భాగం.. ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఆగస్టు 1 న రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది.
ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో మూవీ ది బ్యాట్ మ్యాన్ -2. ఈ సినిమా 2027 అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. బ్యాట్ మ్యాన్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ది బ్యాట్ మ్యాన్-2 మూవీకి అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో కొత్త విలన్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో పలు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై జేమ్స్ గన్ ని సోషల్ మీడియాలో ప్రశ్నించగా ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం 2027 అక్టోబర్ 1లోనే చూడాల్సి ఉంటుంది అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ చిన్నా పెద్దా అందర్నీ అలరించడం కోసం సూపర్ హీరోల సినిమాలు మరోసారి మన ముందుకి రాబోతున్నాయి అని తెలిసి అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు.
