నెట్ ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు సిరీస్ ట్రైలర్.. సందీప్ 'సూపర్ సుబ్బు' ఎక్కేలా కనిపిస్తోందే..
ఇప్పటివరకు పలు రకాల పాత్రలు చేసిన ఆయన, ఈసారి సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది.
By: M Prashanth | 24 Jun 2026 10:45 PM ISTటాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్ లో నటించిన సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ ట్రైలర్ వైరల్ గా మారింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నిర్మించిన తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ కావడంతో ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ తోపాటు సోషల్ మెసేజ్ కలిపి రూపొందించి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
సిరీస్ లో సందీప్ కిషన్ సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు రోల్ లో కనిపించనున్నారు. సర్కార్ స్కూల్ లో జాబ్ కోసం ఎదురు చూస్తున్న అతడికి అనుకోకుండా మాకిపూర్ అనే గ్రామంలో పోస్టింగ్ వస్తుంది. అయితే అది నార్మల్ టీచర్ గా కాదు. గ్రామ ప్రజలకు సె*క్స్ ఎడ్యుకేషన్, పీపుల్ కంట్రోల్ పై అవగాహన కల్పించే టీచర్ గా పని చేయాల్సి వస్తుంది. దీంతో ఎదురయ్యే ఇబ్బందులు, గ్రామస్థుల రెస్పాన్స్ చుట్టూనే కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
ట్రైలర్ లో చూపించిన సీన్స్ కడుపుబ్బా నవ్వించాయి. గ్రామంలో ప్రతి చిన్న విషయం పెద్ద చర్చగా మారడం, సుబ్బు చెప్పే విషయాలను ప్రజలు వేరే విధంగా అర్థం చేసుకోవడం వంటి అంశాలు నవ్వులు పంచేలా కనిపిస్తున్నాయి. సమాజంలో ఇప్పటికీ ఏదోలా భావించే విషయాలను సరదాగా చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ కెరీర్ లో ఇది భిన్నమైన పాత్రగా చెప్పాలి.
ఇప్పటివరకు పలు రకాల పాత్రలు చేసిన ఆయన, ఈసారి సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. ఆయన యాక్టింగ్ సిరీస్ కు మెయిన్ అసెట్ గా నిలిచేలా కనిపిస్తోంది. దర్శకుడు మల్లిక్ రామ్ సిరీస్ ను తెరకెక్కించారు. డీజే టిల్లు వంటి చిత్రాలతో మెప్పించిన ఆయన, ఈసారి వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ట్రైలర్ లో కనిపించిన డైలాగులు, పాత్రల తీరు, విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి.
మరోవైపు యానిమేషన్, కిడ్స్ కంటెంట్ రంగంలో మంచి గుర్తింపు పొందిన చిలకా ప్రొడక్షన్స్ సిరీస్ ను నిర్మించడం విశేషం. ప్పటివరకు ప్రధానంగా యానిమేషన్ ప్రాజెక్టులతో పేరు తెచ్చుకున్న ఈ నిర్మాణ సంస్థ, తొలిసారిగా భారీ స్థాయి లైవ్ యాక్షన్ వెబ్ సిరీస్ ను రూపొందించింది. మిథిలా పాల్కర్, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, మానస చౌదరి, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుత రోజుల్లో రీజనల్ స్టోరీస్ కు ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే దిశగా నెట్ ఫ్లిక్స్ కూడా తెలుగు ప్రేక్షకులను నేరుగా ఆకట్టుకునే ప్రయత్నంలో సూపర్ సుబ్బును తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. జూలై 2 నుంచి తెలుగు సహా పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఆ సిరీస్.. ఆడియన్స్ కు ఎక్కేలా కనిపిస్తోంది. ఏదేమైనా ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విడుదలకు ముందే సూపర్ సుబ్బుపై ఆసక్తి పెరుగుతోంది.
