సుప్రీంకోర్టు సంచలన తీర్పులో యామీ!
ఈ సిరీస్ లు అన్ని మార్కెట్ లో కాస్త వివాదాన్ని రేపిన సిరీస్ లే. ఈ నేపథ్యంలోనే గత ఏడాదే మరో వివాదాస్పద అంశాన్ని టచ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
By: Srikanth Kontham | 23 Sept 2025 3:03 PM ISTజాతీయ అవార్డు గ్రహీత సుపర్ణ్ వర్మ సినిమాలంటే బాలీవుడ్ లో ఎంతో ప్రత్యేకం. వివాదాస్పద అంశాలను..వాస్తవ జీవితాలను టచ్ చేస్తూ సినిమాలు చేయడం సుపర్ణ్ ప్రత్యేకత. `ది ఫ్యామిలీ మ్యాన్`, `రానా నాయుడు`, `ది ట్రయల్`, `సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ`, `సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై` వంటి వెబ్ సిరీస్ ల విజయం వెనుక సుప్ణర్ణ కలం బలం ఎంతో కీలకమైంది. ఈ సిరీస్ లు అన్ని మార్కెట్ లో కాస్త వివాదాన్ని రేపిన సిరీస్ లే. ఈ నేపథ్యంలోనే గత ఏడాదే మరో వివాదాస్పద అంశాన్ని టచ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
రియలిస్టిక్ స్టోరి.. కఠినమైన కోర్టు కేసు - షా బానో బేగం కేసు ఆధారంగా ఓ చిత్రానికి సంకల్పించారు. దీనికి ఆయనే దర్శకుడు కూడా. షా బానో బేగం vs మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంతో సంచలనమైన సంగతి తెలిసిందే. షాబానో బేగం కేసుగా ప్రజల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో ఓ మైలు రాయిగా పరిగణించిన టాపిక్ ఇది.1978 లో షాబానో భర్త మోహమ్మద్ తో కోర్టులో సుదీర్గ పోరాటం సాగించారు. అహ్మద్ ఖాన్ ఆమెకు విడాకులిచ్చాడు. ఈకేసులో షాబానో గెలుపొందింది. అయితే ఈ తీర్పు ఇస్లామిక్ చట్టానికి విరుద్దమని ఒక వర్గం ప్రజలు విశ్వసించడం అప్పట్లో కలకలం రేపింది.
దేశంలో వివిధ మతాలకు వేర్వేరు సివిల్ కోడ్లు కలిగి ఉండటం చర్చకు దారి తీసింది. తీర్పు వెలువడిన నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ఈ చర్చ సాగుతోంది. అలాంటి అంశాన్ని టచ్ చేస్తూ సుపర్ణ్ ఈ సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు `హక్` అనేది టైటిల్. ఇందులో బాధిత మహిళ పాత్రలో యామీ గౌతమ్ పోషిస్తోంది. ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాదే సినిమా ప్రకటించిన మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో సినిమా లేదనుకున్నారంతా.
కానీ తాజాగా సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడంతో ప్రాజెక్ట్ సెట్స్ లో ఉంది అన్న సంగతి తేలింది. ఇమ్రాన్ హష్మీ, యామీగౌతమీ పోస్టర్లో ఎంతో బ్యూటీఫుల్ గా కనిపిస్తున్నారు. ఆకాశంలోకి గాలిపటం ఎగరేస్తూ ఆస్వాదించడం చూడొచ్చు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశకు చేరుకుంది. ప్రచార చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అన్ని పనులు పూర్తి చేసి నవంబర్ 7న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
