బాహుబలి బ్రాండ్ తో మార్కెట్లో ప్రయత్నాలా?
సినిమా ప్రచారంలో ఎవరి స్ట్రాటజీ వారికుంటుంది. అంతిమంగా సినిమా జనాలకు చేరిందా ? లేదా? అన్నదే ముఖ్యం. అది ఎలా జరిగిందన్నది ముఖ్యం కాదు.
By: Srikanth Kontham | 16 Sept 2025 2:00 PM ISTసినిమా ప్రచారంలో ఎవరి స్ట్రాటజీ వారికుంటుంది. అంతిమంగా సినిమా జనాలకు చేరిందా ? లేదా? అన్నదే ముఖ్యం. అది ఎలా జరిగిందన్నది ముఖ్యం కాదు. అందుకే చిత్రీకరణ ముగింపు దశకు రాగానే ప్రచారం పనులు ఒక్కొక్కటిగా మొదలవుతుంటాయి. అప్పటి నుంచి ప్రేక్షకుల మధ్యలోనే సినిమా ఉండే లా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. తాజాగా `సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి` ప్రచారం కోసం `బాహబలి` బ్రాండ్ ని వినియోగిస్తున్నారు. పాన్ ఇండియాలో `బాహుబలి` ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సస్ అయిందే తెలిసిందే.
అందుకే బాహుబలి రేంజ్ లో:
అంతర్జాతీయంగానూ ఆ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. సోషల్ మీడియా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన టైటిల్ అది. అందుకే `సన్నీ సంస్కారీకి తులసీ కుమారి` టీమ్ ఇప్పుడు తెలివిగా బాహుబలి పేరిట మార్కెట్ లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో హీరోయిన్ గా జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమా అంటే అనన్యాపాండేకు ఇష్టమని అందుకే హీరో బాహుబలి స్టైల్లో ప్రపోజ్ చేస్తానంటాడు.
ట్రైలర్ తో తిరుగులేదు:
మరి `బాహుబలి`లో స్టైల్లో ప్రపోజ్ చేస్తే నిజంగానే ప్రేమను అంగీకరిస్తారా? లేదా? అన్నది తెలియా లంటే సన్నీ సంస్కారీకి తులసీ కుమారి చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. శశాంక్ ఖతాన్ తెరకెక్కిస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రచార చిత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
పాన్ ఇండియా లో అలా:
ప్రచారంలో భాగంగా `బాహుబలి` టైటిల్ వినియోగించడంతో తెలుగు ఆడియన్స్ కు ఆ సినిమా ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే? బాలీవుడ్ చిన్న చూపుగా చూసేది. తెలుగు సినిమా టైటిల్ అక్కడ వినిపించేది కాదు. అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమా గురించి బాలీవుడ్ మాట్లాడు తుం దంటే? అందుకు ఆద్యుడు రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన తెరకెక్కించిన `బాహుబలి` సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. అటుపై రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` తో ఆ స్థానం పదిల మైంది. అనంతరం `కార్తికేయ-2`, `పుష్ప`, `హనుమాన్` లాంటి సిని మాలు పాన్ ఇండియాలో ఆ స్థానాన్ని సుస్థిరం చేసాయి.
