తులసి కుమారి ముద్దులకు కత్తెర పడిందట..!
బాలీవుడ్ ప్రేక్షకులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'సన్నీ సంస్కారికి తులసీ కుమారి' సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 1 Oct 2025 12:29 PM ISTబాలీవుడ్ ప్రేక్షకులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'సన్నీ సంస్కారికి తులసీ కుమారి' సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే. ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించింది. వీరిద్దరి కాంబోలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చిందట, కానీ 13+ వయసు కండీషన్ పెట్టిందని తెలుస్తోంది. అంటే ఈ సినిమాలో ఒక మోస్తరు రొమాన్స్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే బాలీవుడ్ మీడియాలో ఈ సినిమా యొక్క సెన్సార్ కట్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
సన్నీ సంస్కారికి తులసీ కుమారి మూవీకి యూ/ఎ సర్టిఫికెట్
బాలీవుడ్‌కి చెందిన సోషల్ మీడియా పేజీల్లో సన్నీ సంస్కారి తులసీ కుమారి సినిమాకు సెన్సార్ బోర్డ్ మొత్తం చూసిన తర్వాత ఎ సర్టిఫికెట్ ఆఫర్ చేయడం జరిగిందట. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ కావాలని మేకర్స్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దాంతో సెన్సార్ బోర్డ్ పలు కట్స్ చెప్పి, పలు డైలాగ్స్‌కి కత్తెర వేసి, కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేయడం ద్వారా యూ/ఎ ఇచ్చిందని తెలుస్తోంది. ముఖ్యంగా ముద్దు సీన్స్ ఏకంగా 60% కట్ చేశారని తెలుస్తోంది. లెంగ్తీ ముద్దు సీన్స్‌తో పాటు, కాస్త రొమాంటిక్ యాంగిల్ కెమెరా ఫోజ్‌లు సైతం ఉన్నాట. వాటిని కాస్త జూమ్ ఇన్ చేయడం ద్వారా, కొన్ని షాట్స్‌ను ట్రిమ్ చేయడం ద్వారా సెన్సార్ బోర్డ్ కండీషన్‌తో యూ/ఎ కి ఓకే చెప్పిందని అంటున్నారు. అవన్నీ ముద్దులు ఉండి ఉంటే యూత్ ఆడియన్స్‌కి తులసీ కుమారి విశ్వరూపం చూపించేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
జాన్వీ కపూర్ అందాల ఆరబోత
జాన్వీ కపూర్ ఈ సినిమాలో తులసి కుమారి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో జాన్వీ కపూర్ అందం రెట్టింపు, అంతకు మించి అయిందా అన్నట్లుగా అందంగా ఉందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గత చిత్రం పరమ్ సుందరిలో జాన్వీ కపూర్ ఎంత అందంగా కనిపించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపించబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ముఖ్యంగా పోస్టర్స్ చూసిన వారు, టీజర్, ట్రైలర్‌ను నచ్చిన వారు అంటున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఒక పాటలో అల్ట్రా మోడ్రన్‌గా కనిపించడంతో పాటు, చాలా అందంగా కనిపించింది. అయితే ఆ పాటలో ఆమె డాన్స్‌కి కాస్త విమర్శలు ఎదురైన విషయం తెల్సిందే. ఈ సినిమాలో సన్యా మల్హోత్ర సైతం నటించింది. ఆమెను మించి జాన్వీ కపూర్‌కి ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
బుచ్చిబాబు, రామ్ చరణ్ పెద్దిలో
పరమ్ సుందరి సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్‌కి చాలా తీవ్ర నిరాశే మిగిలింది. ఆ సినిమాతో పోల్చితే ఈ సినిమాలో అందాల ఆరబోత విషయంలో మరింత అడ్వాన్స్‌గా జాన్వీ కపూర్ ఉంటుందని అంటున్నారు. కనుక ఈ సినిమా హిట్ అయితే జాన్వీ బాలీవుడ్‌లో తన హిట్ ఖాతా తెరిచినట్లు అవుతుంది. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం కోసం బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగులో ప్రస్తుతం జాన్వీ కపూర్ పెద్ది సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా కోసం జాన్వీ కపూర్ విభిన్నమైన లుక్ లో కనిపించబోతుంది. వచ్చే ఏడాదిలో రాబోతున్న పెద్ది సినిమాతో టాలీవుడ్‌లో జాన్వీ మరో విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.
